నాచురల్ బ్యూటీ సాయి పల్లవి బంపర్ ఛాన్స్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఏకంగా పవర్ స్టార్ పక్కన నటించే అవకాశం పట్టేసింది అట. టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ వార్త జోరుగా ప్రచారం అవుతుంది. 
గత ఏడాది చివర్లో కమ్ బ్యాక్ ప్రకటించిన పవన్ కళ్యాణ్ వరుసగా మూడు చిత్రాలు అనౌన్స్ చేశాడు. పింక్  రీమేక్ వకీల్ సాబ్ తో పాటు, దర్శకుడు క్రిష్ తో ఒక చిత్రం, హరీష్ శంకర్ తో మరొక చిత్రం ప్రకటించడం జరిగింది. ఆ తరువాత మరో స్టార్ డైరెక్టర్ సురేంధర్ రెడ్డితో మరొక చిత్రం ఆయన ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ వరుస ప్రకటనలు ఆయన ఫ్యాన్స్ ని ఎంతో ఆనందానికి గురి చేశాయి. 

ఇక ఇటీవల పవన్ తన 30వ చిత్రంపై కూడా అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రంలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఈ మూవీ మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్ కి తెలుగు రీమేక్ అన్న మాట గట్టిగా వినిపిస్తుంది. 

ఆ చిత్ర రీమేక్ హక్కులు దక్కించుకున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ పవన్ తో చేస్తుంది ఆ చిత్రమే అంటున్నారు. చాలా కాలంగా ఈ రీమేక్ పై టాలీవుడ్ లో అనేక పుకార్లు రావడం జరిగింది. ఈ రీమేక్ లో నటిస్తున్నారంటూ బాలయ్య, రవితేజ, వెంకటేష్ వంటి హీరోల పేర్లు వినిపించాయి. చివరికి ఇది పవన్ వద్దకు చేరిందన్న మాట విన్పిస్తుంది. 

కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవి అవకాశం దక్కించుకుందని సమాచారం. ఈ మూవీలో పవన్ భార్య పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారట. నటనకు ప్రాధాన్యం ఉన్న ఆ పాత్ర కోసం సాయి పల్లవి సరిపోతుందని డైరెక్టర్ ఆలోచనట. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ జోరుగా ప్రచారం అవుతుంది. 

ప్రస్తుతం తెలుగులో లవ్ స్టోరీ, విరాట పర్వం చిత్రాలలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి ఇంత వరకు స్టార్ హీరోల సరసన అవకాశం దక్కించుకోలేదు. మరి ఈ వార్త నిజమే అయితే సాయి పల్లవి మొదటిసారి ఆ అవకాశం దక్కించుకున్నట్లు అవుతుంది.