'ఫిదా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శర్వానంద్ సరసన తెలుగులో 'పడి పడి లేచే మనసు' సినిమాలో నటిస్తోంది.

అలానే తమిళంలో ధనుష్ సరసన 'మారి2' సినిమాలో నటిస్తోంది. గతంలో తమిళంలో వచ్చిన 'మారి' సినిమాకి సీక్వెల్ గా దర్శకుడు బాలాజీ మోహన్ 'మారి 2' సినిమాను తెరకేక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది చిత్రబృందం.

పక్కా మాస్ లుక్ లో ఆటో డ్రైవర్ అవతారంలో దర్శనమిస్తోంది సాయి పల్లవి. ఇప్పటివరకు క్లాస్ లుక్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ మాస్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మాస్ స్టెప్ వేస్తూ ఉన్న సాయి పల్లవి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి ఆటో డ్రైవింగ్ కూడా నేర్చుకుందట. ధనుష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సాయి పల్లవికి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి!

 

 

సంబంధిత వార్తలు 
మారీ 2: ధనుష్ తో సాయి పల్లవి రోమాన్స్ స్టిల్స్