సాయిపల్లవి అంటే డాన్స్ కి కేరాఫ్‌. ఆమె డాన్సులు మ్యాచ్‌ చేయడం హీరోలకు చాలా కష్టమే. ఇప్పుడు ఏకంగా జపాన్‌లో తన ఊరమాస్‌ డాన్సుతో రెచ్చిపోయింది.  

లేడీ పవర్‌ స్టార్‌గా రాణిస్తుంది సాయి పల్లవి. అద్భుతమైన నటనతోపాటు మైండ్‌ బ్లాక్‌ చేసే డాన్సుతోనూ ఆకట్టుకుంటుంది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న ఆమె ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతూ `ఏక్‌దిన్‌` అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో అమీర్‌ ఖాన్‌ కొడుకు జునైద్‌ ఖాన్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. తన సొంత ప్రొడక్షన్‌ అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌ పతాకంపై ఈ మూవీ రూపొందుతుంది. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ జపాన్‌లో జరుగుతుంది. గత కొన్ని రోజులుగా జపాన్‌లోని సప్పారో ప్రాంతంలో షూట్‌ చేశారు. జపాన్‌ షెడ్యూల్‌ తాజాగా పూర్తి చేసుకుంది. దీంతో టీమ్‌ అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందులో సాయిపల్లవి రెచ్చిపోయింది. టీమ్‌తో కలిసి డాన్సు చేసింది. అది మామూలు డాన్స్ కాదు, షారూఖ్‌ ఖాన్‌ `చెయ్య చెయ్య` పాటకి ఆమె డాన్సు చేయడం విశేషం. టీమ్‌ అందరిలోనూ ఒకే అమ్మాయి సాయిపల్లవి, కానీ ఊరమాస్‌ డాన్సుతో రెచ్చిపోయింది. టీమ్‌లో ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడం అది ట్రెండ్‌ అవుతుంది. 

ఇక సాయిపల్లవి చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కంటెంట్‌ బాగున్న సినిమాలు, అందులోనూ తన పాత్ర కి ప్రయారిటీ ఉన్న చిత్రాలే చేస్తుంది. అందులో భాగంగా ఆమె చివరగా తెలుగులో `విరాట పర్వం` మూవీలో నటించింది. ఇది విమర్శకులను మెప్పించింది. కానీ కమర్షియల్‌గా ఆడలేదు. ఇప్పుడు తెలుగులో నాగచైతన్యతో కలిసి `తండేల్‌` మూవీలో నటిస్తుంది. ఆంధ్రలోని ఓడరేవు ప్రాంతంలో జాలర్ల జీవితాల బ్యాక్‌ డ్రాప్‌లో సాగే మూవీ. ఇందులో చైతూకి జోడీగా చేస్తుంది సాయిపల్లవి. 

Scroll to load tweet…

చందుమొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది పాన్‌ ఇండియా మూవీగా రాబోతుంది. ఇది దసరాకి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతోపాటు తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి ఓ సినిమా చేస్తుంది. కమల్‌ హాసన్‌ ప్రొడక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం. ఇలా తెలుగు, తమిళం, హిందీలో ఒక్కో మూవీతో బిజీగా ఉంది సాయిపల్లవి. 

read more: బాలయ్య, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ కలిసి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా?.. ఇండస్ట్రీ మొత్తం దిగింది