Asianet News TeluguAsianet News Telugu

అఫీషియల్: ‘లవ్‌స్టోరి’ రిలీజ్ డేట్ ఫిక్స్

 వినాయక చవితి సందర్బంగా సినిమా   సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తామన్నారు కానీ అదీ జరగలేదు. అయితే ఆ రోజున నాని నటించిన ‘టక్ జగదీష్‌’ ఓటీటీలో విడుదల కావటంతో తమ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు ‘లవ్ స్టోరీ’ దర్శకనిర్మాతలు.  

Sai pallavi Love Story to release on Sep 24
Author
Hyderabad, First Published Sep 11, 2021, 6:57 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ ఒకటి. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకి కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. ఈ సినిమాను సెప్టెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా శేఖర్ కమ్ముల రీషూట్ లు పెట్టారు.  కొన్ని ట్రాన్సిక్షన్ షాట్స్, ప్యాచ్ అప్ సీన్స్  ఈ రీసెంట్ షెడ్యూల్ లో షూట్ చేసారు.  మొత్తానికి అన్ని పనులు పూర్తి అయ్యాయి. దాంతో వాయిదా అనవసరం అని ఈ  డేట్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాస్తవానికి ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేసారు. ఆ తర్వాత వినాయక చవితి సందర్బంగా సినిమా   సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తామన్నారు కానీ అదీ జరగలేదు. అయితే ఆ రోజున నాని నటించిన ‘టక్ జగదీష్‌’ ఓటీటీలో విడుదల కావటంతో తమ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు ‘లవ్ స్టోరీ’ దర్శకనిర్మాతలు.  అయితే ఈ సారి ఎట్టి పరిస్దితుల్లోనూ సెప్టెంబర్ 24న రావటం ఖాయం అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు పలు మ్యూజిక్ ఛార్ట్ లలో చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శకనిర్మాతలు.
 
రూరల్ బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన హీరో హీరోయిన్లు హైదరాబాద్ వంటి మహా నగరంలో ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో సాయి పల్లవి పాత్రపై అత్యాచార ప్రయత్నం కూడా జరుగుతుందిట. అక్కడ నుంచే కథ మలుపు తిరుగుతుంది అంటున్నారు.  శేఖర్ కమ్ముల మరోసారి భావోద్వేగ ప్రేమకథతోనే వస్తున్నా కానీ ఈసారి మరింత స్ట్రాంగ్ పాయింట్ ను తీసుకున్నాడని అంటున్నారు.  ఇవన్ని ఎంత వరకూ నిజమో అంటే కొద్ది రోజులు రిలీజ్ దాకా ఆగాల్సిందే.

ఫైనల్ కట్ ప్రస్తుతం ప్రిపేర్ అవుతోంది. అవుట్ ఫుట్ చూసుకున్న  శేఖర్ కమ్ముల చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ క్రమంలో దర్శ క,నిర్మాతలు కలసి రిలీజ్ డేట్ పై కసరత్తులు చేస్తున్నారు. సెప్టెంబర్ 24 లేదా 30న ఈ సినిమాని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. సాధ్యమైనంత మేరకు సెప్టెంబర్ 24 కావచ్చు అంటున్నారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రావచ్చు. అన్ని పరిస్థితులు అక్కడ అనుకూలం కాగానే... ఏ క్షణంలోనైనా ‘లవ్‌స్టోరి’ విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 ‘లవ్‌స్టోరీ’లోని పాటలు విశేషంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘సారంగదరియా’ పాట విశేష ప్రజాదరణ పొందింది. అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.   ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి సంగీతం: పవన్‌ సి.హెచ్‌., ఛాయాగ్రహణం: విజయ్‌ సి. కుమార్‌, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌. 
 

Follow Us:
Download App:
  • android
  • ios