ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. టిపికల్ హీరోయిన్ పాత్రలు కాకుండా కథలో తనకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటుంది. ఈ విషయంలో దర్శకనిర్మాతలను ఇరిటేట్ చేస్తుందని సమాచారం. ఈమెకి కథ చెప్పడానికి వెళ్తోన్న దర్శకులు ఆమె ప్రవర్తన కారణంగా విసిగిపోతున్నారట.

అసలు విషయంలోకి వెళ్తే.. రీసెంట్ గా ఆమెకి కథలు చెప్పాలని వెళ్లిన కొందరు దర్శకనిర్మాతలను కూర్చోబెట్టి రెండేసి గంటల పాటు కథ వినేసి హీరోయిన్ గా తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని రిజెక్ట్ చేయడం వంటివి చేస్తోందట. కథ మొత్తం విన్న తరువాత కథ బాలేదని చెప్పడం, లేదా హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత లేదనడం చేస్తోందట. టాలీవుడ్ లో ఎక్కువగా హీరో సెంట్రిక్ సినిమాలే వస్తాయనే విషయం అందరికీ తెలుసు.

కానీ తన మీదే కథలు రాయాలని సాయి పల్లవి డిమాండ్ చేస్తోందట. సాయి పల్లవితో చేస్తే ఇతర రాష్ట్రాలలో కూడా మార్కెట్ ఉంటుందని ఆమెని నిర్మాతలు సంప్రదిస్తున్నారు. అయితే ఎంత పెద్ద నిర్మాత అయినా కానీ సాయి పల్లవి వారిని తిప్పి పంపేయడం చేస్తోందట. మునుపటితో పోలిస్తే సాయి పల్లవి సినిమాలకు కాస్త క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. ఒక టైంలో ఆమె అంటే పిచ్చెక్కిపోయిన అభిమానులు కూడా ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు.

అయినా కానీ సాయి పల్లవి వచ్చిన అవకాశాలను వినియోగించుకోకుండా నిర్మాతలను ఇరిటేట్ చేస్తోంది. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు ఆమెని కన్సిడర్ చేయడం కూడా మానేశారట. ఇక సాయి పల్లవి తన ప్రవర్తన మార్చుకోకపోతే గనుక ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేదని అంటున్నారు.