సాయిపల్లవి `పుష్ప2`లో నటిస్తుందనే రూమర్‌ ఆ మధ్య వచ్చింది,అందులో నిజం లేదని తేలింది. తాజాగా `దేవర`లో ఆమె నటించబోతుందని మరో వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

సాయిపల్లవి అంత ఈజీగా ఏ సినిమాకి ఒప్పుకోదు. ఆమె పాత్రకి ప్రయారిటీ ఉంటేనే, సినిమాలో తనది బలమైన పాత్ర అయితేనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది. చిన్న చిన్న రోల్స్ చేయడానికి కూడా ఇష్టపడదు. హీరోయిన్‌ తరహాలోనే ఉండాలి. అందుకే చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తుంది సాయిపల్లవి. ఆమె చేతిలో ఇప్పుడు ఒకే సినిమా ఉంది. తమిళంలో శివ కార్తికేయన్‌తో కమల్‌ హాసన్‌ ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేస్తుంది. టాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా లేదు. ఆఫర్లు వస్తున్నా, తనకు నచ్చే కథల కోసం వెయిట్‌ చేస్తుంది. 

అయితే ఆ మధ్య సాయిపల్లవి `పుష్ప2`లో కీలక పాత్రలో కనిపించబోతుందనే రూమర్స్ వచ్చాయి. దీనికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. తాను నటించడం లేదని సాయిపల్లవి పరోక్షంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో అవన్నీ ఉట్టి రూమర్సే అని తేలిపోయింది. ఈ నేపథ్యంలో మరో క్రేజీ రూమర్‌ రచ్చ చేస్తుంది. `దేవర` చిత్రంలో సాయిపల్లవి నటించబోతుందని, ప్రముఖ సినీ విశ్లేషకుడు సైతం ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. `దేవర` చిత్రంలో నటించడానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అన్నారు. చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయట. 

రూమర్‌ రావడమే ఆలస్యం.. స్టోరీ రెడీ అయిపోయింది. ఇందులో ఆమె ఎన్టీఆర్‌కి భార్యగా కనిపిస్తుందని, అయితే ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తండ్రీ కొడుకులుగా తారక్‌ కనిపించబోతున్నారని సమాచారం. తండ్రి పాత్రకి పెయిర్‌గా, ఆయనకు భార్యగా సాయిపల్లవి కనిపిస్తారని సమాచారం. అయితే తండ్రి పాత్రని విలన్లు చంపేస్తారని, దీంతో కొడుకు ప్రతీకారం నేపథ్యంలో సినిమా సాగుతుందట. కోస్టల్‌ ఏరియాలో గుర్తింపుకి నోచుకోని ఓ గ్రామం బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్‌ తండ్రి పాత్రని చంపినా, సాయిపల్లవి పాత్ర మాత్రం బతికే ఉంటుందని సమాచారం. 

ప్రస్తుతం ఈ రూమర్‌ వైరల్‌ అవుతుంది. హాట్‌ టాపిక్‌గానూ మారింది. ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చింది యూనిట్‌. ఇందులో నిజం లేదని తెలిపింది. ట్విట్టర్‌ వేదికగా `దేవర` టీమ్‌ `నో` అంటూ వెల్లడించింది. దీంతో ఈ క్రేజీ గాసిప్‌కి ఫుల్‌ స్టాప్‌ పడినట్టయ్యింది. ఇక ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. దర్శకుడు కొరటాల శివ దీన్ని భారీ పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. `ఆచార్య`తో అనేక అవమానాలు ఫేస్ చేసిన ఆయన `దేవర`తో అందరి నోళ్లు మూయించాలనే కసితో ఉన్నట్టు సమాచారం. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ అప్‌ డేట్‌ వచ్చింది. సినిమా షూటింగ్‌ శరవేగంగా చిత్రీకరిస్తున్నారు కొరటాల శివ. ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్ట్స్ షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కాబోతుంది. జులై 3, సోమవారం నుంచి కొత్త షెడ్యూల్‌ స్టార్ట్ అవుతుందట. ఇందులో భారీ హై ఆక్టేన్‌ యాక్షన్‌ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తారట. పీటర్‌ హెయిన్స్ సారథ్యంలో ఈ యాక్షన్‌సీన్లు చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికి చాలా వరకు యాక్షన్‌ సీన్లపై దృష్టి పెట్టారట. సెప్టెంబర్‌ నెల నుంచి టాకీ పార్ట్ లు స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం.