నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. ఆ రెండు చిత్రాలలో సాయి పల్లవి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. రానా హీరోగా తెరకెక్కుతున్న విరాట పర్వం మూవీలో పల్లెటూరి అమ్మాయిగా చేస్తున్నారు. 90ల కాలం నాటి అమ్మాయిగా సాయి పల్లవి ఓ సీరియస్ రోల్ కనిపించనుంది. సాయి పల్లవి నక్సలిజం మద్దతుదారుగా కనిపించే అవకాశం కలదని సమాచారం. ఇప్పటికే బయటికి వచ్చిన ఆమె లుక్ ఆసక్తిరేపేలా ఉంది. 

అలాగే శేఖర్ కమ్ముల  దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ మూవీపై యూత్ లో మంచి క్రేజ్ ఉంది. గతంలో ఫిదా మూవీ ద్వారా సాయి పల్లవితో  సంచలనాలు చేసిన శేఖర్ కమ్ముల ఈసారి ఆమెను ఎలా ప్రెజెంట్ చేస్తారనే క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఈ మూవీలో కూడా సాయి పల్లవి లుక్ మిడిల్ క్లాస్ అమ్మాయిని తలపించడం విశేషం. నాగ చైత్యన్యతో సాయి పల్లవి రొమాన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. 

లాక్ డౌన్ తరువాత లవ్ స్టోరీ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. నాగ చైత్యన్య, సాయి పల్లవిల మధ్య కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. సంక్రాంతిని టార్గెట్ చేసిన ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా లాక్ డౌన్ కారణంగా నెలల తరబడి ఇంటికే పరిమితం అయిన సాయి పల్లవి హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కాగానే విహారానికి వెళ్లారు. తన చెల్లి మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఉదక మండలం ఊటీ వెళ్లిపోయారు. అక్కడ ఫ్యామిలీతో కొన్ని రోజులు సాయి పల్లవి జాలీగా ఎంజాయ్ చేయనుందట. సాయి పల్లవి ఏ ట్రిప్ కి వెళ్లినా కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉంటారు.