ఈమధ్య కాస్త సినిమాలకు గ్యాప్ తీసుకుంది సాయిపల్లవి. మళ్ళీ తిరిగి యాక్టీవ్ అవుతోంది. అంతే కాదు వరుస ఆఫర్లు కూడా ఆమె తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్స్ లో కూడా చురుకుగా పాల్లొంటోంది. 

నచ్చిన సినిమా..మెచ్చిన కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సాయి పల్లవి. అవసరమైతే ఖాళీగా అయినా ఉంటుంది కాని.. యాక్టింగ్ స్కోప్ లేని పాత్రలు చేయదు.. హీరోయిన్ ఇంపార్టెనస్ లేకుంటే సినిమాలు ఒప్పుకోదు. ఆమధ్య వరుసగా ప్లాప్ లు పలకరించడం..తనకు తగినపాత్రలు రాకపోవడంతో.. కాస్త గ్యాప్ ఇచ్చింది బ్యూటీ. సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడిప్పుడే మళ్ళీ యాక్టీవ్అవుతోంది. షూటింగ్స్ లో కూడా జాయిన్ అవుతోంది సాయి పల్లవి. 

తెలుగులో ఆమె అఫీషియల్ గా ఒక్క ప్రాజెక్ట్ లో కన్ ఫార్మ్ అయ్యింది. మరో సినిమా కూడా అనౌన్స్ మెంట్ రావల్సి ఉంది. అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి రూపోందిస్తున్న సినిమా తండేల్. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. ప్రమోగాత్మకంగా తెరకెక్కుతున్న తండేల్ సినిమా కోసం చైతూ చాలా కష్టపడ్డాడు. ఎంతో పీల్డ్ వర్క్ చేశాడు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీలో నాగచైతన్య జాలరి పాత్రలో నటిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈమూవీని గీత ఆర్ట్స్ బ్యానర్ పై.. భారీ బడ్జెట్ తో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. 

ఇక ఈమూవీ షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక లోని గోకర్ణ ప్రాంతంలో జరుగుతుండగా తాజాగా సెట్స్ లోకి హీరోయిన్ సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా బీచ్ వ్యూ.. సూర్యాస్తమయం, సూర్యోదయాలు ఇక్కడ అద్భుతంగా ఉంటాయి. దాంతో షూటింగ్ విరామ సమయంలో సాయంత్రం సూర్యాస్తమయం వేళ అక్కడి బీచ్ అందాలను ఎంజాయ్ చేసింది సాయి పల్లవి. సాయి పల్లవి సూర్యుడు సముద్రం ముగ్గురు కలిసి ఓ పిక్ దిగారు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇక తండేల్ మూవీ షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు మేకర్స్. దర్శకుడు చందూ మొండేటి ఈ మూవీ పై కాన్సంట్రేట్ చేశాడు. ఎలాగైనా హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈసినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక ఈ మధ్య ప్లాప్ లతో సవాసం చేస్తున్న నాగచైతన్య ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు.