అభిమానులు అంతగా అరుస్తుంటే ఆనందంలో ఉప్పొంగిపోయింది సాయిపల్లవి. ఎమోషనల్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను ఎక్కడ కలిసినా చాలా మంది పెద్ద వారు తమ పిల్లల్లాగా, చెల్లిలాగా చూస్తూ తమ ప్రేమని పంచుతుంటారు. 

నేచురల్‌ అందం సాయిపల్లవి వర్సెటైల్‌ యాక్టర్‌గా, అద్భుతమైన డాన్సర్‌గా రాణిస్తుంది. టాలీవుడ్‌లో ఆమె వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఆమెని అభిమానులు లేడీ పవన్‌ కళ్యాణ్‌గా పిలుచుకుంటుండటం విశేషం. పవర్‌ స్టార్‌ మాదిరిగానే సాయిపల్లవి స్టేజ్‌పైకి వచ్చిందంటే అరుపులు మోతలతో ఉర్రూతలూగిపోతుంది ప్రాంగణం. తాజాగా `విరాటపర్వం` ఆత్మీయ వేడుక(ప్రీ రిలీజ్‌ ఈవెంట్)లోనూ అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. సాయిపల్లవి వేడుకకి వచ్చేటప్పుడు, ఆమె స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు అభిమానులు అరుపులతో హోరెత్తించారు. 

అభిమానులు అంతగా అరుస్తుంటే ఆనందంలో ఉప్పొంగిపోయింది సాయిపల్లవి. ఎమోషనల్‌ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను ఎక్కడ కలిసినా చాలా మంది పెద్ద వారు తమ పిల్లల్లాగా, చెల్లిలాగా చూస్తూ తమ ప్రేమని పంచుతుంటారు. తనని ఎంతో ఆదరిస్తున్నారు. ప్రేమిస్తున్నారు. అభిమానులు తనని ఎంతగానో ప్రేమిస్తారని, వారి ప్రేమకి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపింది సాయిపల్లవి. అయితే తనపై ఇంతటి ప్రేమని కురిపిస్తున్న వారికి పే బ్యాక్‌ ఏదైనా ఉందంటే అది `విరాటపర్వం` సినిమా చేయడమే అని తెలిపింది. 

వరంగల్‌కి గతంలోనూ వచ్చాను. ఇప్పుడు మరోసారి వచ్చానని, ఇక్కడికి వచ్చినప్పుడు తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుందని తెలిపింది. ఈ సినిమా మన మట్టి కథ అని తెలిపింది. నిజాయితీగా చెప్పిన కథ ఇదని, మనం పుట్టి పెరిగిన మట్టి కథ అని, ఇలాంటి సినిమాలు చేయడం అనేది ప్రేమని తిరిగి ఇచ్చినట్టు అవుతుందని చెప్పింది సాయిపల్లవి. ఈ సినిమాలోని నా పాత్ర నిజమైన ప్రేమని ఎక్స్ ప్రెషన్‌ లాగా ఉంటుందని తెలిపింది. ఇదొక నిజాయితీతో కూడిన కథ అని, ప్రేమలోని నిజాయితీని తెలియజేస్తుందని చెప్పింది. ఇలాంటి సినిమాలను ఆదరించాలని, అప్పుడే మరిన్ని సినిమాలు చేస్తామని తెలిపింది. 

`విరాటపర్వం` ఇక్కడి(వరంగల్‌)కి చెందిన కథ అని, ఇలాంటి పాత్రని, ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు వేణు ఉడుగులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమాని బ్లెస్‌ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌కి, తరుణ్‌ భాస్కర్‌కి నిర్మాతలు, రానా, ఇలా అందరికి ధన్యవాదాలు తెలిపింది సాయిపల్లవి. రానాతో కలిసి ఆమె నటించిన `విరాటపర్వం` చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా, సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం జూన్‌ 17న విడుదలవుతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ `విరాటపర్వం ఆత్మీయ వేడుక` పేరుతో వరంగల్‌లో ఆదివారం సాయంత్రం జరిగింది.