సాధారణంగా హీరోయిన్స్ అందరూ ఒకటే స్కూల్ లో వెళ్తూంటారు. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవ‌డంలో తన ప్రతిభను చూపెడుతూంటారు. అందులో తప్పేమి లేదు.  ఆ తర్వాత వాళ్లని పట్టించుకునే వాళ్లు ఉండరు. ఎందుకంటే హీరోయిన్స్ తెరపై ఎక్కువ కాలం ఉండలేరు. తర్వాత అక్క పాత్రలు, అత్త పాత్రలు, అమ్మ పాత్రలుకు వెళ్లిపోవాలి. అందుకే త‌మ నేమూ.. ఫేమూ ఉన్నప్పుడే నొల్లేసుకోవాలనుకుంటారు. తమకు ప్రస్తుతం ఉన్న ఇమేజ్ ని క్యాష్ చేసుకోవటానికి ఉత్సాహం చూపిస్తారు. సాయి ప‌ల్ల‌వి కూడా అదే చేస్తోందంటున్నారు. త‌న రెమ్యునేషన్ పెంచేసి నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. అదెలా బయిటకు వచ్చింది అంటే...ప‌వ‌న్ క‌ల్యాణ్ `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్ కోసం సాయి ప‌ల్ల‌విని ముందుగా సంప్ర‌దించారు. 

ఆ సినిమా కోసం ఏకంగా 3 కోట్లు డిమాండ్ చేసింద‌ని టాక్‌. అంత ఇచ్చుకోలేక‌.. నిత్య‌మీన‌న్ తో ముందుకు వెళ్తున్నారంటున్నారు. అయితే మరో ప్రక్క అంతలేదు. ఆమె పాత్రను కొద్దిగా పెంచమంది. దర్శక,నిర్మాతలు ఒప్పుకోలేదు. అందుకే తప్పుకుంది అని ప్రచారం జరుగుతోంది. నిజానికి `అయ్య‌ప్ప‌యుమ్...` చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కాదు. ఏదో పెట్టాలని పెట్టడమే కానీ హీరోయిన్ల‌కు ఈ క‌థ‌లో పెద్ద స్కోప్ లేదు. అలాంట‌ప్పుడు 3 కోట్లు ఇచ్చి, సాయి ప‌ల్ల‌విని ఎంచుకోవ‌డం ఎందుక‌న్న‌ది నిర్మాత లాజిక్. అందుకే సాయి ప‌ల్ల‌విని ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చిందని చెప్పుకుంటున్నారు.  

ఇక ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు. ఈ రీమేక్ కోసం మొదట్లో చాలా పేర్లు వినిపించాయి. కాక‌పోతే…. స్క్రిప్టు ప‌నుల‌న్నీ సాగ‌రే పూర్తి చేసి షూటింగ్ మొదలెట్టాడు. కానీ కరోనా సెకండ్ వేవ్ తో షూటింగ్ ఆగిపోయింది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెండో హీరోగా రానా న‌టిస్తున్నారు.  ప్రస్తుతం ప‌వ‌న్ రెస్ట్ లో ఉన్నారు. ఆయన చేతిలో చాలా సినిమాలున్నాయి. మ‌రి ఈ సినిమాని ఎప్పుడు మొద‌లెడ‌తారో చూడాలి.