ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ ట్రైలర్‌ హల్‌చల్‌ చేస్తుంది. అందరిని షాక్‌కి గురిచేస్తుంది. సినీ పెద్దలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ ట్రైలర్‌ పేరు `పావ కథైగల్‌`. తమిళంలో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ ఇది. ప్రకాష్‌ రాజ్‌, గౌతమ్‌ మీనన్‌, సాయిపల్లవి, అంజలి, కల్కీ కొచ్లిన్‌ వంటి విలక్షణ తారాగణం నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ఇది. మరి అంతగా ఆకట్టుకునే, అంతగా ఎంగేజ్‌ చేసే అంశాలు ఏమున్నాయనేది చూస్తే.. 

తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో సాయిపల్లవి గర్బవతిగా కనిపిస్తుంది. అంజలి, కల్కి కొచ్లిన్‌ లెస్బియన్‌గా కనిపిస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనకు ఓ పాప ఉంది. ప్రకాష్‌ రాజ్‌.. సాయిపల్లవి తండ్రిగా విభిన్న పాత్రలో కనిపిస్తున్నారు. నాలుగు కథలను చెప్పే వెబ్‌ సిరీస్‌ ఇది. ఆద్యంతం ఎంగేజ్‌ చేయడంతోపాటు మనుషు మధ్య సంఘర్షణని తెలిపే ఈ వెబ్‌సిరీస్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఈ వెబ్‌ సిరీస్‌ మొత్తం నాలుగు కథల సమాహారంగా సాగుతుండగా, సుధ కొంగర, వెట్రిమారన్, గౌతమ్ మీనన్, విఘ్నేశ్ శివన్ వంటి టాప్‌ దర్శకులు రూపొందిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో ఇది విడుదల కానుంది. ట్రైలర్‌తోనే సౌత్‌ భాషలన్నింటిని షేక్‌ చేస్తుంది. విడుదల తర్వాత ఇది ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేస్తుందో చూడాలి.