సౌత్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ అని కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటోంది సాయి పల్లవి. అమ్మడు ఇటీవల పడి పడి లేచే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాక్టర్ గా కనిపించి తనదైన నటనతో సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇకపోతే అమ్మడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్కూల్ డేస్ లో బాయ్స్ ఫాలోయింగ్ గురించి బయటపెట్టేసింది.

అప్పుడు కూడా తన మొహంపై మొటిమలు ఉండేవని అయినా కూడా అబ్బాయిలు తెగ చూసేవరని వివరణ ఇచ్చింది. అయితే ఎప్పుడు కూడా లవ్ పై తనకు మనసు మళ్లలేదని పుస్తకాలతోనే ప్రేమలో పడిపోయా అని ఫిదా బ్యూటీ నవ్వుతూ చెప్పింది. ఇక కొంత మంది అబ్బాయిలు నా వైపు ఎంత చూసినా కూడా మాట్లాడటానికి ధైర్యం చేసేవారు కాదని ఈ కొంటె పిల్ల సమాధానం ఇచ్చింది.

ఇక ప్రస్తుతం కూడా ఎలాంటి లవ్ లేదని కేవలం సినిమాలతోనే తన ప్రేమ అంటూ డిఫరెంట్ కౌంటర్ ఇచ్చింది. అయితే ప్రేమమ్, ఫిదా, పడి పడి లేచే మనసు సినిమాలో ప్రేమించడం విడిపోవడం ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటి పాత్రల గురించి తాను ఆలోచించలేదని అన్న సాయి పల్లవి నెక్స్ట్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ లేకుండా చూసుకుంటా వివరణ ఇస్తూ పొట్టి బట్టలు వేసుకోవడానికి కూడా ఇష్టం ఉండదని చెప్పింది. అయితే ఫిదాలో మాత్రం ఒక సీన్ లో వేసుకోక తప్పలేదని క్యారెక్టర్ పరంగా సీన్ డిమాండ్ చేసినట్లు సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది.