మలయాళం కుట్టి సాయి పల్లవి క్రేజ్ ఏమిటో ఫిదా సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి తెలిసిపోయింది. ఆమెకు తగ్గట్టు పాత్ర సినిమాలో సెట్టయితే సినిమాకు ఎంతగా ప్లస్ అవుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే గత కొంత కాలంగా అమ్మడికి సక్సెస్ లు అందడం లేదు. చేసిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తున్నాయి. 

ఇకపోతే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సినిమా కెరీర్ క్లోజయితే హ్యాపీగా నా వైద్య వృత్తిలో కొనసాగుతానని అమ్మడు వివరణ ఇచ్చింది. వైద్య విద్య చదివి నటిగా ఎదిగినట్లు చెప్పిన బేబీ సినీ ఇండస్ట్రీలో తేడా కొడితే ఎక్కువ రోజులు ఇక్కడే పాతుకుపోనని తెలిపింది. 

అదే విధంగా ఉన్నన్ని రోజులు వీలైనంత వరకు డిఫరెంట్ రోల్స్ చేయాలనీ ఉందని చెబుతూ.. అవకాశం వస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా పోకియా మంచి సందేశాత్మక చిత్రంలో నటించడం తన చిరకాల కోరికని సాయి పల్లవి వివరణ ఇచ్చింది.