జవాన్ మూవీ రివ్యూ రేటింగ్

First Published 1, Dec 2017, 1:52 AM IST
sai dharamtej jawaan movie review rating
Highlights
  • చిత్రం - జవాన్
  • తారాగణం- సాయిధరమ్ తేజ్, ప్రసన్న, మెహరీన్, ప్రవీణ్, కోట శ్రీనివాసరావు తదితరులు
  • సంగీతం-  తమన్
  • నిర్మాత- కృష్ణ
  • దర్శకత్వం- బివిఎస్ రవి
  • ఆసియానెట్ రేటింగ్- 3/5

ఏడాది కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు సాయిధరమ్ తేజ్. తక్కువ కాలంతోనే ఫుల్ మెచురిటి చూపిస్తూ.. తనకంటూ మార్కెట్ ఏర్పరచుకున్నాడు. ఈ ఏడాది విన్నర్, నక్షత్రం సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. అయితే.. ఏడాది చివరలో ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ ఫస్ట్ డేనే జవాన్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అంతే కాక చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత బివిఎస్ రవి దర్శకత్వంలో వస్తున్న మూవీ జవాన్. ముందునుంచీ టైటిల్ కున్న క్యాచీనెస్ వల్ల, జవాన్ అనే పదానికుండే.. స్ట్రెంత్ వల్ల సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి తేజ్ హిట్టు కొట్టాడా.. రివ్యూలో చూద్దాం..

కథ-

జై(సాయి ధరమ్ తేజ్) దేశం కోసం ఎంతటికైనా తెగించే మనస్తత్వం కలవాడు. తనకు చిన్నప్పటి నుంచి నాన్న పెంపకంలో నేర్చుకున్న క్రమశిక్షణ, నిజాయితీల వల్ల నిప్పులా బతుకుతుంటాడు. స్కూల్ టీచర్ గా పని చేసే జై తండ్రి() ఎదురింటి అబ్బాయి కేశవ(ప్రసన్న) చిన్నప్పటి నుంచి నెగటివ్ మనస్తత్వం కలిగి వుండటం గమనించి తల్లిదండ్రులను హెచ్చరిస్తాడు. మాస్టారు కారణంగా తన తండ్రి కేశవని చితక బాత్తాడు. ఇంటి నుంచి వెళ్లి పొమ్మంటాడు. జైని చూసి నేర్చుకో అంటాడు. అది నచ్చని కేశవ తనకు నచ్చిన దారిలో వెళుతూ.. ఇల్లీగల్ దందాలతో.. డాన్ గా ఎదుగుతాడు. ఓ అంతర్జాతీయ తీవ్రవాద ముఠా... భారత్ లో తయారైన ఆక్టోపస్ అనే క్షిపణిపై కన్నేస్తుంది. కేశవతో దాన్ని ఎలాగైనా తమకు అప్పగించాలనే డీల్ కుదుర్చుకుంటుంది. డీల్ ఓకే కాగానే కేశవ క్షిపణిని దొంగిలించేందుకు స్కెచ్ వేస్తాడు. అందులో భాగంగా జై కుటుంబాన్ని, ప్రేమించిన అమ్మాయి భార్గవి(మెహరీన్)ని ఇక్కట్ల పాలు చేస్తాడు. దాన్ని జై ఎలా అడ్డుకున్నాడు. తన డ్రీమ్ అయిన డీఆర్డీవో సైంటిస్ట్ పోస్ట్ ఎలా పొందాడు. ఆక్టోపస్ ను ఎలా కాపాడాడు. జై వృత్తి ధర్మం నిర్వర్తించడం కోసం కుటుంబం ఎలాంటి ఇక్కట్ల పాలైంది. వాటిని జై ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ.

 

విశ్లేషణ-

కథ ఆరంభంలోనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు బలమైన విరుద్ధ మనస్తత్వాలు కలిగి వుంటే.. వాళ్లు పెద్దయ్యాక జరగబోయే డ్రామా.. హీరో విలన్ ల మైండ్ సెట్ ఎలా వుంటుందనే సీన్స్ కొన్ని చూపించారు. దర్శకుడు బివిఎస్ రవి ఎంచుకున్న కథ చాలా బలమైందనే చెప్పాలి. ఒక జవానుగా ఎదగాలనుకునే వారికి ఎలాంటి క్రమశిక్షణ అవసరం, ఎంతటి పట్టుదల అవసరమో చూపిస్తూ... దేశం కోసం దేనికైనా రెడీగా వుండే జై అనే కేరక్టర్ ను చాలా బలంగా చూపించాడు. అయితే సాయి ధరమ్ తేజ్ ఇమేజ్ కు తగ్గ రేంజిలో సినిమా లేదని పిస్తుంది. మెగా మేనల్లుడిగా క్రేజున్న సుప్రీంహీరో తేజ్ ను ఇంకాస్త.. హీరోయిజం ఎలివేట్ అయేలా.. ఫైట్స్,, యాక్షన్ సీన్స్ అల్లుకుంటే బాగుండేది. అయితే హీరోయిన్ గ్లామర్ తో హీరోయిజాన్ని అలా చూపించేశాడు దర్శకుడు. అక్కడక్కడా ఇంకా మెరుగ్గా డైలాగ్స్ కానీ, ఎడిటింగ్ కానీ వుండి వుంటే బాగుండనిపిస్తుంది. మెహరీన్ గ్లామర్ ను మాత్రం సరిగ్గానే వాడుకున్నారు. లిప్ కిస్ సీన్ లో... అందాల ఆరబోసే పాటల్లో మెహ్రీన్ అందం సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక విలన్ రోల్ లో ప్రసన్న అద్భుతంగా నటించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు విలన్, హీరోకు మధ్య నడిచే మైండ్ గేమ్ లో... హీరో జై కుటుంబాన్ని చంపే ప్లాన్ లో కేశవ, విలన్ ప్లాన్ నుంచి కుటుంబాన్ని కాపాడుకోవటంలో జై చూపిన తెలివితేటలు బాగా రాసుకున్నారని అనిపిస్తుంది. ఇక ఇంటర్వల్ తర్వాత విలన్ హీరో ఇంటికి వచ్చి తిష్టవేయటం, ఇద్దరి మధ్య సాగే మైండ్ గేమ్ ఆకట్టుకుంటుంది. అయితే ఇలాంటి అద్భుతమైన కథ రాసుకున్నప్పుడు.. దాన్ని తగ్గ విధంగా స్క్రీన్ పై ప్రజెంట్  చేయటంలో చాలా సార్లు దర్శకులు విఫలం కావడం చూస్తుంటాం. బివిఎస్ రవి కూడా.. ఎందుకో ఈ విషయంలో తానేమీ స్పెషల్ కాదనిపించుకున్నాడు. అందరిలానే.. కథకు తగ్గ స్క్రీన్ ప్లే కనిపించలేదు. అయితే.. అక్కడక్కడా మెరిసిన డైలాగులతో బాగానే కవర్ చేసేశాడు.

 

చివరగా-

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కు కెరీర్ బెస్ట్, ఫ్యాన్స్ కు జవాన్ తో ఫుల్ ఫెస్ట్

loader