టాలీవుడ్ లో మెగా హీరోల లిస్ట్ పెద్దగానే ఉన్నా రాజకీయాలకు వారి సపోర్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చెప్పడం కష్టమే. కానీ ఏ హీరో ఎలా ఉన్నా కూడా సాయి ధరమ్ తేజ్ మాత్రం చిన మామయ్య పార్టీ జనసేనకు ప్రతిసారి మద్దతు పలుకుతుండడం కామన్. 

రీసెంట్ గా గ్లాసుని చూపిస్తూ తన సినిమాకు సంబందించిన పోస్టర్ ని రిలిజ్ చేశాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్ర లహరి సినిమాలో గ్లాస్‌మేట్స్‌ అనే సాంగ్ ఉంది. ఆదివారం సాయంత్రం 7గంటలకు పాటను రిలీజ్ చేయనున్నారు. అయితే పోస్టర్ లో సేమ్ జనసేన గాజు గుర్తును ఉంచిన సాయి ఇన్ డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నాడు అని కామెంట్స్ వస్తున్నాయ్. 

అయితే తేజ్ సాంగ్ రిలీజ్ అయ్యేవరకు ఏ విధంగా మామయ్య పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడో  అనే విషయంలో క్లారిటీ రాదు. సాంగ్ లో ఎలాంటి మ్యాటర్ ఉంటుందో  రేపు చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు.