హరర్ థ్రిల్లర్ జోనర్ నుఇష్టపడే వారికి ఈసినిమా విపరీతంగా నచ్చుతుంది ఆలాగే మిగతావారికి కూడా బిగ్ స్క్రీన్ మీద చూస్తే విరూపాక్ష మంచి ఎక్సపీరియన్స్ ని ఇస్తుంది.
ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్,షేర్ మాత్రమే ఇప్పుడు ఏ సినిమాకు అయినా కీలకంగా మారింది. వీకెండ్ పూర్తవగానే కలెక్షన్స్ పూర్తి స్దాయిలో డ్రాప్ అవుతున్నాయి. దాంతో శుక్ర,శని,ఆదివారం మీదే అందరి దృష్టీ ఉంటోంది. దాంతో కొందరు ఒక్క అడుగు ముందుకు వేసి గురు లేదా బుధ వారం కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. ఈ చిత్రం మొన్న శుక్రవారం థియేటర్ల లో విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అటు ఆడియెన్స్ ను, ఇటు క్రిటిక్స్ ను ఈ మూవీ కు మంచి అప్లాజ్ వస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ షేర్ ఎంత అనేది ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అందుతున్న సమాచారం మేరకు వరల్డ్ వైజ్ గ్రాస్ - 34 Cr approx
వరల్డ్ వైడ్ షేర్ 20.59 Cr(GST తీసేస్తే 19 Cr)
ఏరియా వైజ్ చూస్తే...
నైజాం - 7.2 Cr [Incl GST]
వైజాగ్ - 2.05 Cr [Incl GST]
సీడెడ్ - 2.31 Cr
గుంటూరు - 1.19 Cr
నెల్లూరు - 0.56 Cr
కృష్ణా - 0.93 Cr
వెస్ట్ గోదావరి -0.85 Cr
ఈసోట్ గోదావరి - 1.1 Cr
ఆంధ్రా/తెలంగాణా - 16.19 cr
రెస్టాఫ్ ఇండియా - 1.4 Cr
ఓవర్ సీస్ - 3 Cr
ప్రపంచ వ్యాప్తంగా - 20.59 Cr
ప్రీ రిలీజ్ బిజినెస్ - 25 Cr (excluding GST)
ఇక ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ హక్కలు అయితే దిగ్గజ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అయితే థియేటర్స్ లో రన్ కంప్లీట్ అయ్యాక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉండనుంది అని చెప్పాలి. మే చివరి వారంలో కానీ, జూన్ మొదటి వారంలో కానీ ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది.
ఈ సినిమా బాగుందా..నచ్చుతంగా అంటే...హారర్ థ్రిల్లర్ జోనర్ నుఇష్టపడే వారికి ఈసినిమా విపరీతంగా నచ్చుతుంది ఆలాగే మిగతావారికి కూడా బిగ్ స్క్రీన్ మీద చూస్తే విరూపాక్ష మంచి ఎక్సపీరియన్స్ ని ఇస్తుంది. అయితే ఎక్సపెక్టేషన్స్ లేకుండా వెళ్లాల్సిన అవసరం ఉంది.
