వాటికి తోడు సుకుమార్ బ్రాండ్ వేల్యూ యాడ్ కావడంతో మంచి ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి మరీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంటున్నారు. 


కార్తీక్‌ దండు దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో 2023 ఏప్రిల్‌ 21న రిలీజ్‌ కానుంది. ఈ నేపధ్యంలో చిత్రం బిజినెస్ ఊపందుకుంది.

ట్రేడ్ వర్గాల అందుతున్న సమాచారం మేరకు ...'విరూపాక్ష' తెలుగు థియేట్రికల్ హక్కులను 22 కోట్ల రూపాయలకు అమ్మడుపోయినట్లు సమాచారం. ఈ రేటు ఏపీ, తెలంగాణకు మాత్రమే కావటం విశేషం. పశ్చిమ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ప్రవీణ్ ఈ రైట్స్ ని రికార్డ్ రేటు పెట్టి సొంతం చేసుకున్నారు. సాయి తేజ్ మార్కెట్ కు ఇది పెద్ద ఆపరే. 'ప్రతిరోజూ పండగే', ' సోలో బతుకే సో బెటర్', 'రిపబ్లిక్' మంచి విజయాలు సాధించాయి. వాటికి తోడు సుకుమార్ బ్రాండ్ వేల్యూ యాడ్ కావడంతో మంచి ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి మరీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంటున్నారు. 

 ఇంకా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు.అన్నమాట. మిగతా రాష్ట్రాలనుంచి కూడా మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు వినికిడి. మరో ప్రక్క శాటిలైట్ & డిజిటల్ రైట్స్ అదనంగా రానున్నాయి. నెట్ ప్లిక్స్ ఇప్పటికే ఈ చిత్రం రైట్స్ ని మంచి రేటుకు సొంతం చేసుకుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా 'విరూపాక్ష' రూపొందుతోంది. ఇలాంటి హారర్ లేదా థిల్లర్ సినిమా సాయి ధరమ్ తేజ్ చేయడం ఇదే మొదటిసారి. 

కార్తీక్‌ దండు మాట్లాడుతూ– ‘‘1990 నేపథ్యంలో ఫారెస్ట్‌ బేస్డ్‌ విలేజ్‌లో జరిగే థ్రిల్లర్‌ ఇది. అక్కడ జరిగే వింత పరిణామాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది. ప్రమాదం నుంచి కోలుకున్నాక సాయిధరమ్‌ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మా సినిమా కోసం ఎంతో కష్ట పడ్డాడు’’ అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు సతీష్‌ బీకేఆర్, అశోక్‌ బండ్రెడ్డి, సంగీత దర్శకుడు అజనీష్‌ లోక్‌నాథ్‌ పాల్గొన్నారు.