చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇక మధ్యలో యాక్సిడెంట్ అవ్వడంతో.. ఇక కెరీర్ పై హోప్స్ వదిలేసుకోకుండా.. పట్టుదతో సినిమా చేశాడు. ప్రస్తుతం దిల్ ఖుష్ అవుతున్నాడు సాయి తేజ్.. పార్టీ చేసుకుంటున్నాడు.
టాలీవుడ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ విరూపాక్ష.ర సుకుమార్ డైరెక్షన్ స్కూల్ నుంచి వచ్చిన కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అవుతూ.. తెరకెక్కిన ఈమూవీ.. తెలుగు, తమిళ భాషల్లో ఈరోజు రిలీజ్ అయ్యింది. అయితే విడుదలైన అన్ని థియేటర్లలో మంచి రెస్పాన్స్ తో .. పాజిటీవ్ టాక్ తో నడుస్తుంది విరూపాక్ష. ఆడియన్స్ మెచ్చే సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో.. థ్రిల్ కలిగేలా సినిమాను తెరకెక్కించాడు కార్తీక్ దండు. సాయి ధరమ్ తేజ్ కు మెమరబుల్ సినిమాను అందించాడు.
ఇక విరూపాక్ష మంచి టాక్‌తో సక్సెస్ ఫుల్ రన్ ను కొనసాగిస్తుండటంతో.. టీమ్ అంతా దిల్ ఖుష్ అవుతున్నారు. ఈనేపథ్యంలో డైరెక్టర్ కార్తీక్ దండు, హీరో సాయిధరమ్ తేజ్ సంతోషంలో మునిగితేలుతున్నారు. విరూపాక్ష సూపర్ హిట్ అని తేలిపోవడంతో పార్టీ చేసుకున్నారు సాయి తేజ్ టీమ్. డైరెక్టర్.. హీరో ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకుని.. అభిమానుల సమక్షంలో సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నవీడియోతోపాటు థియేటర్‌లో ప్రేక్షకుల మధ్యలో హీరోహీరోయిన్లు సినిమా చూస్తూ.. ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈరోజు రిలీజ్ అయిన విరూపాక్ష కలెక్షన్ల విషయంలో కూడా అదరగొడుతందన్న నమ్మకంతో ఉన్నారు మూవీ టీమ్. సినిమా ప్రమోషన్లు.. సాయి ధరమ్ తేజ్ పడ్డ కష్టం సినిమా సక్సెస్ కు కారణం అవుతాయి అంటున్నారు టీమ్. ఈ సక్సెస్ బూస్ట్ తో.. సాయి తేన్ నెక్ట్స్ సినిమాలు కూడా అద్భుతంగా చేయాలన్నపట్టుదల వచ్చినట్టు తెలుస్తోంది. ఒక స్టేజ్ లో బాగా ఇబ్బందులుపడ్డ సాయితేజ్ కు.. ఈసినిమా గట్టి హోప్ ను కాన్ఫిడెట్ ను ఇచ్చింది.
విరూపాక్ష సినిమాలో సాయిధరమ్ తేజ్ జతగా.. సంయుక్తా మీనన్ నటించగా.. మూవీకి కాంతార ఫేం అంజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ మూవీలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ విరూపాక్షలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబడుతుందో చూడాలి.
