మెగా మేనల్లుడు  సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న  సినిమా విరూపాక్ష. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో.. కాస్త కొత్తగా ఆలోచించి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. రిలీజ్ కు ముస్తాబవుతున్న ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం డేట్ అండ్ ప్లేస్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.. 

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి మిస్టిక్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది విరూపాక్ష. ఇక ఈమూవీ ప్రీరిలీజ్ వేడుకను ఏలూరు లో నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇప్పటికే విరూపాక్ష మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు మూవీ టీమ్ అన్ని ఏర్పాట్లు చేసింది. . అయితే, ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఎక్కడ నిర్వహిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ వేడుకను ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో ఏప్రిల్ 16న సాయంత్రం 5 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.

ఇక ఈ ఈవెంట్‌కు గెస్టులు ఎవరు వస్తారా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు టీమ్. ఆ విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు టీమ్ ప్రకటించింది. అయితే ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారన్న రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందతి. ఇక విరూపాక్షలో సాయి ధరమ్ తేజ్ సరసన అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న విరూపాక్ష మూవీని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 21న గ్రాండ్ రిలీజ్ అవ్వబోతోంది.