సాయి ధరమ్ తేజ, రకుల్ ప్రీతి సింగ్ కాంబినేషన్ లో గతంలో విన్నర్ సినిమా వచ్చింది.  భాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. సాధారణంగా ఓ సారి ప్లాఫ్ వచ్చిన హీరోయిన్ తో మరోసారి చేయటానికి హీరోలు ఇష్టపడరు. కానీ నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు..రకుల్ కావాల్సిందే అని పట్టుపడుతున్నారట సాయి ధరమ్ తేజ.

ప్రస్తుతం చిత్ర లహరి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న సాయి ధరమ్ తేజ తాజాగా మరో రొమాంటిక్ కామెడీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మారుతి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట రష్మికను అనుకున్నారు. అయితే ఆమె డేట్స్ ఖాళీ లేకపోవటంతో వేరే హీరోయిన్స్ ని వెతకటం మొదలెట్టారు. నలుగురు హీరోయిన్స్ దాకా మారుతికు,నిర్మాతకు నచ్చారు కానీ సాయి ధరమ్ తేజ మాత్రం రకుల్ దగ్గరే ఆగిపోయారట. విన్నర్ కాంబో వర్కవుట్ కాలేదు కదా అని రకుల్ ని వాళ్లు పరిగణనలోకి తీసుకోలేదు. 

కానీ సాయి ..రకుల్ తో నేను మాట్లాడనా అనటం, ఆమె ఉంటే తమిళ,హిందీ మార్కెట్ కూడా ఉంటుందని చెప్పి కన్వీన్స్ చేసాడట.   రకుల్ ని మాత్రం హీరోయిన్ గా తీసుకోండి..మిగతావి మీ ఇష్టం అని పదే పదే చెప్దాంపటంతో... రకుల్ సీన్ లోకి వచ్చిందంటున్నారు. యువి క్రియేషన్స్ నిర్మించే ఈ చిత్రం సాయి ధరమ్ తేజ లోని ఫన్ యాంగిల్ ని పూర్తిగా ఎలివేట్ చేసేలా మారుతి సర్వ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాత్రింబవళ్లూ స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నారని సమాచారం.