సాయిధరమ్‌ తేజ్‌ నెక్ట్స్ మూవీ `గాంజా శంకర్‌`.. అదిరిపోయిన ఫస్ట్ లుక్‌ టీజర్‌..

సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమాకి సాయితేజ్‌ చాలా రోజుల క్రితమే కమిట్‌ అయ్యారు.  ఈ నేపథ్యంలో నేడు ఆయన బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

sai dharam tej next movie title gaanja shankar first look teaser out arj

`విరూపాక్ష`తో బిగ్‌ కమ్ బ్యాక్‌ ఇచ్చారు సాయిధరమ్‌ తేజ్‌. గత చిత్రాలు డిజప్పాయింట్‌ చేసిన నేపథ్యంలో `విరూపాక్ష` పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. కానీ ఆ తర్వాత వచ్చిన `బ్రో` మూవీ నిరాశ పరిచింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన ఈ `బ్రో` మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ నేపథ్యంలో తాను ఏడాది పాటు సినిమాలకు గ్యాప్‌ తీసుకోబోతున్నట్టు ప్రకటించారు సాయిధరమ్‌ తేజ్‌. మెంటల్లీ, ఫిజికల్లీ మరింత స్ట్రాంగ్‌ అయ్యాక తాను సినిమాలు చేస్తానని తెలిపారు. ఏడాదిపాటు విశ్రాంతి తీసుకోనున్నట్టు చెప్పారు. 

ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కొత్త సినిమాని ప్రకటించడం విశేషం. సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమాకి సాయితేజ్‌ చాలా రోజుల క్రితమే కమిట్‌ అయ్యారు. అయితే ఇది ఇప్పటికే పట్టాలెక్కాల్సింది. కానీ సాయితేజ్‌ బ్రేక్‌ ఎఫెక్ట్ ఈ చిత్రంపై పడింది. ఈ నేపథ్యంలో సాయిధరమ్‌ తేజ్‌ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దీనికి `గాంజా శంకర్‌`గా  టైటిల్‌ని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ చేశారు. 

ఈ చిత్ర ఫస్ట్ లుక్‌లో సాయిధరమ్‌ తేజ్‌ మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన ఫేస్‌ క్లారిటీ కానీ, లుక్‌ మాత్రం మాస్‌గా ఉంది. ప్రత్యర్థులను మట్టుపెట్టేందుకు ఆయన ఆయుధాలు పట్టుకుని యాక్షన్‌కి దిగినట్టుగా ఈ ఫస్ట్ లుక్‌ ఉంది. ఓ వైపు దుమ్ములేస్తుండగా, సాయితేజ్‌ నోట్లో సిగరేట్‌తో అదరగొడుతున్నారు. ఇక ఇందులో హీరో పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌ అదిరిపోయింది.  `మాస్‌ని వివరించలేం, జస్ట్ ఫీల్‌ అవ్వాలి ఈ మాసివ్‌ కాంబో` అంటూ ఈ టీజర్‌ ప్రారంభమైంది.

ఓ తండ్రి కూతురుకి కథ చెబుతూ, అప్పుడు సూపర్‌ మ్యాన్‌ ఏం చేశాడంటే.. అని ప్రారంభించగా, అబ్బా ఈ సూపర్‌ మ్యాన్‌,స్పైడర్‌ మ్యాన్ కాదు నాన్న, మన లోకల్‌ మ్యాన్‌ కథ ఉంటే చెప్పు నాన్న అంటుంది. దీంతో అట్లయితే నీకొక సుప్రీం హీరో కథ చెబుతానని, `ఆడు సిన్నప్పుడే చదువు బంజేసిండు, అమ్మానైన్నలు చెబితే ఎన్నడూ ఇన్నది లేదు. అడ్డమైన తిరుగుళ్లన్నీ తిరుగుతడు. ఇక జర్దాలు, సరదాలు, గుట్కాలు,  తాగుళ్లు, మందు, మశ్శానం ఆనికి లేని దరిద్రపు అలవాట్లంటూ లేవు.. అని చెప్పగా, ఇంతకి ఏం చేస్తాడు నాన్న అని అమ్మాయి అడగ్గా లీజీ వెజిటేబుల్స్ అమ్ముతుంటాడమ్మా అని తండ్రి చెబుతాడు. దీంతో పోలీసులు అతన్ని వెంటపడుతుంటారు. అవేంటి నాన్న అంటే అదోరకం ఆకులు లేదు. 

అతనెక్కడుంటాడు నాన్న అంటే.. పది ఉంటే పార్క్ లో పంతాడు, పదివేలుంటే పార్క్ హయత్‌లో పంతాడు. అతని పేరు అమ్మాయి అడగ్గా `గాంజా శంకర్‌` అని టైటిల్‌ పడటం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ గాంజాయి ఆకుల స్మగ్లర్‌గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక టీజర్‌ చివర్లో ప్రత్యర్థులను అంతం చేసి `మార్కీకిరికిరి.. `అంటూ హిందీలో సాయిధరమ్‌ తేజ్‌తో వచ్చే వాయిస్‌ ఆకట్టుకుంటుంది. టీజర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మొదటిసారి సాయితేజ్‌ పూర్తి స్థాయి మాస్‌, ఊరమాస్‌ మూవీ చేయబోతున్నారని అర్థమవుతుంది. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. `మ్యాడ్` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. రిషి పంజాబీ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. `గాంజా శంకర్‌` కి సంబంధించిన షూటింగ్‌, ఇతర కాస్టింగ్‌ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయని టీమ్‌ తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios