Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ ఖరారు,డైరక్టర్ ఎవరంటే !!

తేజ్ కోలుకోవడంతో తర్వాత ఏ దర్శకుడితో సినిమా చెయ్యనున్నాడనే విషయం మీద ఆసక్తి నెలకొంది ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌తో   ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర  అయ్యిన టాలెంటెడ్ దర్శకుడు తో   సినిమా చెయ్యబోతున్నాడు తేజ్. పక్కా యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కబోయే ఈ మూవీ గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారు.

Sai Dharam Tej Next Is With Sampath Nandi


మూడు నెలల క్రితం హైదరాబాద్ లోని కేబులు బ్రిడ్జి సమీపంలో ప్రమాదానికి (Sai Dharam Tej Accident) గురైన హీరో సాయి తేజ్.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాల బారిన పడిన సాయి తేజ్..   కుటుంబసభ్యుల మధ్య హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. అంతేకాదు తన తదుపరి చిత్రానికి ప్లాన్ చేసుకుంటున్నారు. నాలుగైదు కథలు విన్న సాయి తేజ్ తాజాగా ఓ కథని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ తన తర్వాతి సినిమాను సంపత్ నందితో చేయబోతున్నట్లు తెలుస్తోంది. సంపత్ నంది ఆఖరిగా గోపీచంద్ హీరోగా సీటిమార్ సినిమాతో హిట్ ని అందుకున్నాడు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఇక పోతే తేజ్ సంపత్ ల సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తేజ్ చిత్రలహరి సినిమా చేశారు. ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.

 ఇప్పటికే ఆయన కమిటైన ఓ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానరర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరోవైపు దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన సాయి ధరమ్ తేజ్ 'రిపబ్లిక్' మూవీ జీ5 ఓటీటిలో విడుదలై, హిట్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios