మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస అపజయాల తరువాత చిత్రలహరి సినిమాతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే విజయం అందగానే ఈ కుర్ర హీరో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. చాలా మంది దర్శకులు ఈ హీరో దగ్గరికి డిఫరెంట్ కథలు తెస్తున్నప్పటికీ అవి నచ్చకపోతే నో చెప్పకుండా మరో కథ ఉంటె తీసుకురమ్మని చెబుతున్నాడట. 

ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ప్రతి రోజు పండగే అనే సినిమాతో బిజీగా ఉన్న సాయి రీసెంట్ గా తమిళ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అజిత్ గ్యాబ్లర్ - సూర్య మాస్ సినిమాలకు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు చెప్పిన స్క్రిప్ట్ సాయికి నచ్చినట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళ్ కూడా సినిమాను తెరకెక్కించే ప్లాన్స్ జరుగుతున్నాయి. 

ఇక సాయి ధరమ్ తేజ్ మరో మూడు ప్రాజెక్టులను పెండింగ్ లిస్ట్ లో ఉంచినట్లు తెలుస్తోంది. వీరుపోట్ల - దేవకట్ట లతో కూడా ఈ మెగా హీరో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా సాయి జయాపజయాలతో సంబంధం లేకుండా తన ఎనర్జీతో మంచి అవకాశాలను అందుకుంటున్నాడు.