డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరక్కించిన తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. చాలా కాలం తర్వాత పూరి జగన్నాధ్ ఈ చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. వరుస ప్లాపుల్లో ఉన్న పూరి ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో రామ్ ని పవర్ ఫుల్ గా చూపించాడు. ఈ చిత్రంలో పూరి జగన్నాధ్ పొందుపరిచిన కమర్షియల్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. 

కాగా ఈ చిత్రం కోసం పూరి జగన్నాధ్ మొదట ఓ మెగా హీరోని అనుకున్నాడట. ఇస్మార్ట్ శంకర్ కథని పూరి జగన్నాధ్ సాయిధరమ్ తేజ్ కు వినిపించాడట. ఆ సమయంలో తేజు కూడా ప్లాపుల్లోనే ఉన్నాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ అయినప్పటికీ రొటీన్ మాస్ ఎంటర్ టైనర్ తో రిస్క్ చేయలేక తేజు ఈ చిత్రానికి నో చెప్పాడట. దీనితో ఈ కథ రామ్ చేతుల్లోకి వెళ్ళింది. 

కానీ ఇస్మార్ట్ శంకర్ చిత్రం ప్రస్తుతం ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. తొలి వారంలోనే దాదాపు 27 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు రెండింతల లాభాలు చూస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ మిస్ అయినా తేజు ఈ ఏడాది చిత్రలహరితో హిట్ అందుకున్నాడు. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో.. ప్రతి రోజు పండగే చిత్రంలో నటిస్తున్నాడు.