ప్రముఖ సినీహీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మాదాపూర్‌లోని కేబుల్ బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది. అనంతరం స్థానికులు, పోలీసులు ఆయనను మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 

ప్రముఖ సినీహీరో సాయధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నెం 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నుంచి ఒక్కసారిగా కిందపడ్డారు.  అనంతరం స్థానికులు, పోలీసులు ఆయనను మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కుడికన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. 

 ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్‌ తేజ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. బైక్‌పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్‌ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్‌ సీఐ తెలిపారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా?అన్న అనుమానంతో సాయిధరమ్‌ తేజ్‌కు వైద్యులు స్కాన్‌ చేస్తున్నారని, ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సీఐ వివరించారు..

ప్రమాదం జరిగిన సమయంలో బైక్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రమాదం జరిగిన తీరును తెలుసుకోవడానికి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సైతం ఆస్పత్రికి వచ్చారు. సంఘటనా స్థలం నుంచి బైక్ ను పోలీసులు తరలిస్తున్నారు. హీరో సందీప్ కిషన్ తో పాటు మరికొందరు ఆస్పత్రికి చేరుకున్నారు.

రోడ్డుపై ఇసుక ఉండడంతో బైక్ స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.. సాయి ధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. బైక్ అతి వేగం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత దానిపై స్పష్టత వస్తుందని అంటున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు చెబుతున్నారు.

మెరుగైన వైద్యం కోసం సాయి ధరమ్ తేజ్ ను అపోలోకు తరలిస్తున్నారు. సినిమా షూటింగులు లేని సమయాల్లో తన బైక్ మీద లేదా మిత్రుల బైక్ మీద రైడింగ్ కు వెళ్లడం సాయి ధరమ్ తేజ్ కు అలవాటు. సరదా కోసం ఆ పనిచేస్తుంటారు.