`బ్రో` రిలీజ్‌ సందర్భంగా ఎమోషనల్‌ కామెంట్స్ చేశారు సాయితేజ్‌. పవన్‌తో కలిసి నటించడంపై స్పందిస్తూ `అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ` అంటూ క్యాప్షన్‌తో ఓ ఫోటోని పంచుకుంటూ తన నోట్ ని షేర్‌ చేశారు.

పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ఫస్ట్ టైమ్‌ కలిసి `బ్రో` చిత్రంలో నటించారు. సముద్రఖని రూపొందించిన చిత్రమిది. నేడు శుక్రవారం(జులై 28)న విడుదలైన మూవీ ఇది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. మొదటిసారి మామయ్య పవన్‌ కళ్యాణ్‌తో నటించడం పట్ల సాయిధరమ్‌ తేజ్‌ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమోషనల్‌ కామెంట్స్ చేశారు. సినిమా విడుదలైన నేపథ్యంలో తన కల నెరవేరిందన్నారు. `అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ` అంటూ క్యాప్షన్‌తో ఓ ఫోటోని పంచుకుంటూ తన నోట్ ని షేర్‌ చేశారు. 

ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ చెబుతూ, ఈ రోజుని ఏమని పిలవాలి, నా కల నెరవేరిన రోజు, ఎప్పటికీ మర్చిపోలేని రోజు, ఈ మెమరీని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ప్రస్తుతం నాలోని ప్రతి భావోద్వేగానికి అక్షర రూపం ఇవ్వాలని ఉంది. నా గురువు, మామ, మామయ్య, నా స్ఫూర్తి పవన్‌ కళ్యాణ్‌తో కలిసి తెరని పంచుకునే అదృష్టం దక్కింది. దీన్ని ఎప్పటికీ కాపాడుకుంటాను. నేను ఎప్పటికీ ఆయన చేయి పట్టుకున్న చిన్న పిల్లాడినే. 

నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప సినిమాకు నన్ను ఎంపిక చేసిన త్రివిక్రమ్‌కి ధన్యవాదాలు. మీ వల్లే నా కల నిజమైంది. అలాగే సముద్రఖని, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, `బ్రో` చిత్ర బృందంలోని అందరికీ నా కృతజ్ఞతలు. అన్నిటికంటే ముఖ్యంగా నా ముగ్గురు మామయ్యలకు, వారి అభిమానులకు, సినీ ప్రియులకు అందరికీ ధన్యవాదాలు. మీరు చూపించే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోను. `బ్రో` సినిమా మనందరిదీ, దీన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా. నన్ను ఆదరిస్తున్న ఆడియెన్స్ కి ధన్యవాదాలు` అని తెలిపారు సాయిధరమ్‌ తేజ్‌. 

సాయిధరమ్‌ తేజ్‌ చిన్నప్పట్నుంచి పవన్‌ వద్దే పెరిగాడు. తనే అన్ని చూసుకునేవాడని పలు సందర్భాల్లో సాయితేజ్‌ తెలిపారు. అంతేకాదు తన స్టడీస్‌ నుంచి యాక్టింగ్ స్కూల్ వరకు, సినిమాల్లోకి రావాలనుకునే అభిప్రాయం వరకు పవన్‌ సమక్షంలోనే జరిగిందని సాయితేజ్‌ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. పవన్‌ని మామయ్య కంటే ఎక్కువగా తన గురువుగా భావిస్తుంటాడు తేజ్‌. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే ఇద్దరు హీరోలుగా సినిమాల్లో రాణిస్తున్నా ఇప్పటి వరకు కలిసి నటించలేదు. ఈ నేపథ్యంలో మొదటిసారి `బ్రో` చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా నేడు శుక్రవారం విడుదలైన సందర్భంగా సాయితేజ్‌ ఇలా తన భావోద్వేగభరిత పోస్ట్ ని అభిమానులతో పంచుకున్నారు.

Scroll to load tweet…

ఈ సందర్భంగా చిన్నప్పుడు పవన్‌ కాళ్ల మధ్య ఆడుకుంటున్న ఓ అరుదైన ఫోటోని పంచుకున్నారు తేజ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్ తోపాటు ఈ ఫోటో వైరల్‌ అవుతుంది. ఇక నేడు విడుదలైన `బ్రో` చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. కాకపోతే ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేసేలా ఉంది. అయితే కమర్షియల్‌గా ఇది ఎంత వరకు మెప్పిస్తుందనేది చూడాలి.