తాను మళ్లీ ఇలాస్టేజ్‌ మీద కొచ్చి మాట్లాడతానని ఊహించలేదని, ప్రమాదం జరిగినప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదని, అంతా అయోమయంగా ఉండిందన్నారు సాయిధరమ్‌ తేజ్‌.

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai dharam tej) ఎమోషనల్‌ అయ్యారు. అభిమానులచేత కన్నీళ్లు పెట్టించారు. తాను మళ్లీ ఇలా స్టేజ్‌మీదకొస్తానని ఊహించలేదని, ఇలా మాట్లాడతానని అస్సలు అనుకోలేదని తెలిపారు. ఫ్యామిలీ కలిసిఉంటే ఆ ధైర్యం వేరని, తనకు అమ్మానాన్నలు, తమ్ముడు వైష్ణవ్‌ నా వెంటే ఉన్నారని, వైష్ణవ్‌ నా ధైర్యం, బలమని తెలిపారు సాయిధరమ్‌ తేజ్‌. 

వైష్ణవ్‌ తేజ్‌(Vaishnav Tej) హీరోగా, కేతిక శర్మ(kethika Sharma) కథానాయికగా, గిరీశయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `రంగరంగ వైభవంగా`. బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. దీనికి వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌లు గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్‌ మాట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యారు. తనకు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. 

తాను మళ్లీ ఇలాస్టేజ్‌ మీద కొచ్చి మాట్లాడతానని ఊహించలేదని, ప్రమాదం జరిగినప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదని, అంతా అయోమయంగా ఉండిందన్నారు. ఆ టైమ్‌లో వైష్ణవ్‌ వచ్చిన `అన్నా.. ` పిలిచినా పలకలేని స్థితిలో ఉండిపోయానని చెప్పారు. ఆ సంఘటనల తర్వాత కుటుంబ సభ్యులు కలిసుంటేఎంత బాగుంటుందో,ఎంత ధైర్యంగా ఉండగలమో అర్థమైందన్నారు. 2021 ఎప్పటికీ మర్చిపోలేని రోజు అని, నా తమ్ముడి సినిమా విడుదలైంది. సినిమా పెద్ద హిట్‌ అయ్యిందనేది పక్కన పెడితే, అతన్ని హీరోగా అంగీకరించడం పెద్ద ఆనందాన్నిచ్చిందని చెప్పారు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలన్నారు. 

ఈ సందర్బంగా తానేమీ 90వేసి రాలేదని, తనకు తాగుడు అలవాటే లేదనిచెప్పడం గమనార్హం. మరోవైపు బైక్‌ నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్‌ ధరించాలని చెప్పారు సాయిధరమ్‌ తేజ్‌. తనని హెల్మెటే బతికించిందని, మీరు కూడా బైక్‌పై బయటకు వెళ్తున్నారంటే కచ్చితంగా హెల్మెట్‌ ధరించాలని చెప్పారు. మరోవైపు స్టేజ్‌పైనే వైష్ణవ్‌ తేజ్‌ని ఆటపట్టించడం హైలైట్‌గా నిలిచింది. వైష్ణవ్‌ నవ్వుతే అదే తనకు సంతోషమన్నారు సాయితేజ్‌. సెప్టెంబర్‌ 2న సినిమా చూసి పవన్‌ కళ్యాణ్‌ గారి బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకోవాలని తెలిపారు. 

YouTube video player

ఈ సందర్భంగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ మాట్లాడుతూ, తనకు కాస్త సిగ్గు అని, చాలా తక్కువగా మాట్లాడతానని తెలిపారు. కేతిక శర్మ అలా కాదని, ఆమె చాలా యాక్టివ్‌ అని చెప్పారు. షూటింగ్‌ టైమ్‌లో గిరీశాయను కాస్త ఇబ్బంది పెట్టా. అందుకు సారీ. నా తొలి చిత్రం ‘ఉప్పెన’కి ఇచ్చినట్టే దేవిశ్రీ ప్రసాద్‌ చక్కని పాటలిచ్చారు. సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్నానని చెప్పారు.