సాయిధరమ్ తేజ్ రూ.20 లక్షలు ఇచ్చేశాడు.. పుట్టిన రోజు సందర్భంగా గొప్పమనసు చాటుకున్న మెగా హీరో
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. యాక్సిడెంట్ నుంచి పునర్జన్మ పొందిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు.
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. యాక్సిడెంట్ నుంచి పునర్జన్మ పొందిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఈ ఏడాది విరూపాక్ష చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తేజు.. ఆ తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలసి బ్రో చిత్రంలో నటించాడు.
తేజు నుంచి తర్వాత రాబోతున్న చిత్రం గంజా శంకర్. సంపత్ నంది దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ నేడు తేజు బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయింది. అయితే సాయి ధరమ్ తేజ్ తన పుట్టిన రోజు సందర్భంగా గొప్ప మనసు చాటుకున్నాడు.
భారీ విరాళం ప్రకటించాడు. ఏకంగా 20 లక్షలు డొనేట్ చేయబోతున్నట్లు తేజు ప్రకటించారు. అందులో రూ 10 లక్షలు దేశం కోసం ప్రాణాలు విడిచిన సైనికుల భార్యలకు అందించబోతున్నట్లు తేజు ప్రకటించాడు.
మరో రూ 10 లక్షలు ఏపీ తెలంగాణ పోలీసుల సంక్షేమం కోసం విరాళంగా ఇవ్వబోతున్నట్లు తేజు ప్రకటించాడు. సాయిధరమ్ తేజ్.. తన కెరీర్ లో పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, చిత్రలహరి, విరూపాక్ష లాంటి హిట్స్ సొంతం చేసుకున్నాడు. ప్రమాదం తర్వాత తేజు తొలిసారి నటిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం గంజా శంకర్ అనే చెప్పాలి.