బ్రో మూవీ సక్సెస్ జోష్ లో ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించడపై స్పందించిన ఆయన.. తన జీవితంలో ఓ స్టార్ హీరోతో కలిసి నటించడం కల అని తెలిపారు.  


టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ బ్రో. రీసెంట్ గా ఆడియస్స్ ముందుకు వచ్చిన ఈసినిమా గురించి అటు పొలిటికల్ గా.. ఇటు ఇండస్ట్రీ పరంగా పెద్ద చర్చ నడుస్తోంది. సినిమా సూపర్ హిట్.. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అని మూవీ టీమ్ పండగ చేసుకుంటుంటే.. మరో వర్గం మాత్రం మూవీ డిజాస్టర్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలో సాయి ధరమ్ తేజ్ ఒక అడుగు ముందుకు వేసి.. విజయోత్సవ యాత్రలు కూడా చేస్తున్నాడు. ఈక్రమంలో సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

ఇక బ్రో మూవీ సక్సెస్ టాక్ తొ దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ ని అందుకుంటుంది. దాంతో మూవీ టీమ్ విజయోత్స యాత్ర చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ యూనిట్ తె కలిసి సక్సెస్ యాత్ర నిర్వహించింది. గుంటూరు, తెనాలి, విజయవాడ లో కొన్ని థియేటర్స్ కు వెళ్ళారు. బ్రో మూవీ ప్లే అవుతున్న థియేటర్స్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం గురించి స్పందించారు సాయి తేజ్. తనకు మావయ్య పవన్ కళ్యాణ్ గురువు వంటి వారని, బ్రో లో ఆయనతో వర్క్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఎప్పటికీ మరువలేనని అన్నారు. 

ఇక ఇదే టైమ్ లో సాయి తేజ్ మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా వెల్లడించారు. పెద్ద మావయ్య మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి ఒక సినిమా చేయాలనేది తన కల అని, అది త్వరలోనే తప్పక నెరవేరుతుందని ఆశిస్తున్నట్లు సాయి ధరమ్ తేజ్ తెలిపారు. త్వరలో ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఉంటుందని ఓహింట్ ఇచ్చారు సాయి తేజ్. ఇక బ్రో మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుననాడు మెగా మేనల్లుడు. సముద్రఖని తెరకెక్కించిన ఈ మూవీని జీ స్టూడియోస్ వారితో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. ప్రియా ప్రకాష్ వారియర్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, కేతికా శర్మ, రాజా చెంబోలు తదితరులు బ్రో లో కీలక పాత్రలు చేసారు.