సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నేడు తన 35వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. 'ఏమాయ చేశావే' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సామ్ తొలి చిత్రం నుంచే మాయ చేయడం మొదలు పెట్టింది.
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నేడు తన 35వ జన్మదిన వేడుకలు జరుపుకుంటోంది. 'ఏమాయ చేశావే' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సామ్ తొలి చిత్రం నుంచే మాయ చేయడం మొదలు పెట్టింది. వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంత నార్త్ లో కూడా క్రేజ్ సొంతం చేసుకుంది.
సామ్ నటనకు స్టార్ సెలెబ్రటీలు కూడా ఆమె అభిమానులుగా మారిపోయారు. సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానుల నుంచి సెలెబ్రిటీల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రొమాంటిక్ గా సమంతకి బర్త్ డే విషెస్ తెలిపాడు.
సమంత నటించిన సినిమాల పేర్లు వచ్చేలా తేజు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. 'జెస్సి.. నువ్వు ఏ మాయ చేసావో కానీ ఏటో వెళ్ళిపోయింది మనసు.. హ్యాపీ బర్త్ డే సామ్.. నీ వీరాభిమాని తేజు అంటూ సాయిధరమ్ తేజ్ సమంతపై తన అభిమానం చాటుకున్నాడు.
దీనితో సాయిధరమ్ తేజ్ పోస్ట్ వైరల్ గా మారింది. సినిమాల విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్ చివరగా నటించిన చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత తేజు బైక్ ప్రమాదానికి గురికావడంతో కొన్నిరోజుల పాటు చికిత్స ఆతర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న తేజు తన నెక్స్ట్ మూవీస్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
