Asianet News TeluguAsianet News Telugu

ధరమ్ తేజ్ బర్త్ డే స్పెషల్ సోలో బ్రతుకే సో బెటర్ నుండి లిరికల్ సాంగ్

సాయి ధరమ్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కోసం తన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ నుండి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల చేశాడు. కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ కొత్తగా ఉండగా థమన్ స్వరాలు మరోమారు ఆకట్టుకున్నాయి. ట్రెండీగా సాగిన ఈ సాంగ్ నేపథ్యంలో... రోడ్డుపై హీరోయిన్ నభా నటేష్ ని వేడుకుంటున్న ధరమ్ డాన్స్ మోవ్మెంట్స్ బాగున్నాయి. 

sai dharam tej birth day gift second lyrical song from solo brathuke so better ksr
Author
Hyderabad, First Published Oct 15, 2020, 2:28 PM IST

యంగ్ మెగా హీరో సాయి ధరమ్ నేడు బర్త్ డే జరుపుకున్నారు. ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖుల నుండి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా సాయి ధరమ్ తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్ నుండి ఓ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సాంగ్ విడుదల కావడం విశేషం. ఈ లిరికల్ సాంగ్ లో ''బల్బు కనిపెట్టినోడికే బ్రతుకు చిమ్మ చీకటైపోయిందే..' అనే లిరిక్స్ తో మొదలైన అమృతా సాంగ్ అద్భుతంగా ఉంది. 

కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ కొత్తగా ఉండగా థమన్ స్వరాలు మరోమారు ఆకట్టుకున్నాయి. ట్రెండీగా సాగిన ఈ సాంగ్ నేపథ్యంలో... రోడ్డుపై హీరోయిన్ నభా నటేష్ ని వేడుకుంటున్న ధరమ్ డాన్స్ మోవ్మెంట్స్ బాగున్నాయి. ఈ సాంగ్ ని శేఖర్ కొరియోగ్రఫీ చేస్తుండగా, మెస్మరైజింగ్ స్టెప్స్ అందించినట్లున్నారు. మొత్తంగా ధరమ్ తేజ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కి ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగుంది. 

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓటిటిలో విడుదల కానుందని ప్రచారం జరిగినా అధికారిక ప్రకటన అయితే రాలేదు. థియేటర్స్ త్వరలో తెరుచుకుంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ అందుకోసం వేచి చూస్తున్నట్లున్నారు. గత ఏడాది చివర్లో ప్రతిరోజూ పండగే మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్న ధరమ్, సోలో బ్రతుకే సో బెటర్ తో మరో హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios