వరుస పరాజయాలను చవిచూసిన సాయి ధరమ్ తేజ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగా చేస్తున్న చిత్రలహరి   చిత్రం ఫై చాలా ఆశలు పెట్టుకున్నాడు.  ఈ చిత్రం తరువాత డైరక్టర్ మారుతీ దర్శకత్వంలో నటించనున్నాడు. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్న  ఈ చిత్రంలో సాయి ధరమ్ లాయర్ గా నటించనున్నాడని టాక్. చిరంజీవి సూపర్ హిట్ అభిలాషలో పాత్ర గుర్తుకు వచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందంటున్నారు. సీరియస్ లాయిర్ గా కనిపించే సాయి ..ఫన్ ని ఓ రేంజిలో పండిస్తాడంటున్నారు. 

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే లాంచ్ కానుంది. ఈ చిత్రంలో సాయి కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలనుకుంటున్నారట. ఒకవేళా అదే జరిగితే వీరిద్దరి కి ఇది రెండో సినిమా కానుంది. ఇంతకుముందు ఈ జోడి విన్నర్ లో కలిసి నటించారు.

తనదైనశైలిలో కామెడీలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న దర్శకుడు మారుతి. అయితే ఆయన తాజా చిత్రం శైలజా రెడ్డి డిజాస్టర్ అవటంతో కాస్త వెనకబడ్డారు. నానితో సినిమా అనుకున్నా ముందుకు వెళ్లలేదు. వేరే హీరోలుతో కథలు చేద్దామనుకున్నా అందరికీ డేట్స్ ప్లాబ్లం తో లేటు అయ్యేటట్లు ఉంది. ఈ నేపధ్యంలో మెగా హీరో సాయి ధరమ్ తేజకు కథ చెప్పి ఒప్పించారని సమాచారం.

చిత్రలహరి పూర్తి స్దాయి షూటింగ్ అయ్యాక..రెండు నెలలు టైమ్ తీసుకుని బరువు తగ్గి కనపడతానని సాయి చెప్పినట్లు సమాచారం. అప్పటికి మారుతి తన స్క్రిప్టుకు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉంటారు. సినిమా పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంటో తో సాగుతుందని, భలే భలే మొగాడివోయ్ స్దాయి ఫన్ తో కథ ఉండబోతోందని చెప్తున్నారు.