ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటి వాడు కాగా, రానా కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించాడు. ఇక ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభించిన నితిన్, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న చాలా మంది హీరోల పెళ్లిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. రానా తన ప్రేయసిని పరిచయం చేసిన వెంటనే మరో యంగ్ హీరో వరుణ్ తేజ్‌ పెళ్లికి సంబంధించి కూడా వార్తలు వినిపించాయి. స్వయంగా నాగబాబు త్వరలో నిహారిక, వరుణ్ తేజ్‌ల పెళ్లి అంటూ ప్రకటించినట్టుగా వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తలపై ఫన్నీగా స్పందించాడు మరో యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌, నాగబాబు.. వరుణ్‌ పెళ్లి వార్తల గురించి మాట్లాడినట్టుగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో వచ్చిన వార్తల స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన సాయి ధరమ్‌ తేజ్‌..  `ఏంటి బావా నీకు పెళ్లంట..?` అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌పై వెంటనే స్పందిచిన వరుణ్‌ తేజ్‌ `దానికి చాలా టైం ఉందిలే కానీ మన రానా దగ్గుబాటి, నితిన్‌ మాత్రం ఫర్‌ ఎవర్‌ విత్ యూ అంటూనే సింపుల్‌గా సింగిల్‌ గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయిపోయారు` అంటూ కామెంట్ చేశాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌.. సోలో బ్రతుకే సో బెటరూ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే ఇటీవల గద్దలకొండ గణేష్‌ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్‌, ప్రస్తుతం కిరణ్‌ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.