#SaiDharamTej:సాయి తేజ్.. 'గాంజా శంకర్', ఆగిపోయిందా? కారణం అదే ?
సాయితేజ్ – సంపత్ నంది కాంబినేషన్‌లో ‘గాంజా శంకర్’ అనే సినిమాను ఘనంగా అనౌన్స్ చేశారు
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాగా గాంజా శంకర్ కు ప్రచారం జరిగింది. మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేలా సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా గాంజా శంకర్ వీడియో గ్లింప్స్ ను వదిలారు మేకర్స్. కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాని ప్లాన్ చేసారు డైరెక్టర్ సంపత్ నంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గాంజా శంకర్ సినిమాను నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.మ్యాడ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారని వార్తలు వచ్చాయి.అలాగే ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. అంతే బాగానే ఉంది కానీ ఈ సినిమాని ఆపేసారని తెలిసింది.
మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు బడ్జెట్ కు బిజినెస్ లెక్కలకు సరిపడక ఆపేసారంటున్నారు. మీడియం స్కేల్ సినిమాలకు డిజిటల్ మార్కెట్ డౌన్ అవ్వటంతో ఈ సమస్య వచ్చిందంటున్నారు. ఓటిటి వారు సినిమాలు స్పీడుగా కొనుగోలు చేయటం లేదు. దాంతో ఓటిటి మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని భారి బడ్జెట్ లు ప్లాన్ చేసిన నిర్మాతలు తిరిగి ఆలోచనలో పడుతున్నారు. ఆక్రమంలోనే ఈ ప్రాజెక్టు ఆపేసారని వినికిడి. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం హల్ చల్ చేస్తోంది. అఫీషియల్ గా సంస్ద నుంచి అయితే ప్రకటన లేదు. మరి సంస్ద వారు ఈ విషయమై స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.
‘గాంజా శంకర్’ (Ganja Shankar) సినిమాను రూ.30 కోట్ల నుండి రూ.40 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించాలని టీమ్ ప్లాన్ చేసుకుందట. దీనికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా షురూ చేశారు. అయితే బడ్జెట్ పెరిగి, పెరిగి చివరికి రూ.75 కోట్లకు చేరిందని అంటున్నారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో, మార్కెట్ బట్టి అంత బడ్జెట్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లడం సరికాదని నిర్మాణ సంస్థ అనుకుంటోందట. దీంతో ఆ సినిమా స్థానంలో మరో సినిమా చేస్తారని అంటున్నారు.