మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఫైనల్ గా మూడేళ్ళ తరువాత హిట్టందుకున్నాడు. చివరగా 2016లో సుప్రీమ్ సినిమాతో సక్సెస్ కొట్టి అప్పటివరకు మంచి సక్సెస్ లతో ఉన్న సాయికి తిక్క నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. రిలీజైన ఆరు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. 

మొత్తానికి చిత్ర లహరి సినిమాతో విజయాన్ని అందుకున్న సాయి కాస్త కుదుటపడ్డాడు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి గతంలో పనిచేసిన దర్శకుల గురించి మాట్లాడాడు.  ఇంటిలిజెంట్ సినిమా రిజల్ట్  అనంతరం వినాయక్ తనకీ సారి చెప్పారని అన్నాడు.

తేజు మాట్లాడుతూ.. గత సినిమాల రిజల్ట్ ఏమిటనేది నేను పెద్దగా పట్టించుకోను. పొరపాట్లు ఎన్ని జరిగినా అది నా వల్లే జరిగి ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే కథను ఫైనల్ చేసేది నేనే కాబట్టి. అందుకు బాద్యుడిని కూడా నేనే. తప్పు నాదే. ఇంటిలిజెంట్ అనంతరం వినాయక్ గారు నాకు సారి చెప్పారు. సక్సెస్ ఇవ్వలేకపోయినందుకు చాలా బాధపడ్డారని సాయి వివరణ ఇచ్చాడు.