టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి మాటల్లేవ్ అని గత కొంత కాలంగా రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్ని వార్తలు వచ్చినా కూడా ఇద్దరు హీరోల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో నిన్నటివరకు గొడవ జరగడం నిజమే అనుకున్నారు. 

గతంలో సరైనోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పను బ్రదర్ అంటూ బన్నీ పవన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత మరో ఈవెంట్ లో పవన్ ఫ్యాన్స్ అరుపులకు చెప్తాను బ్రదర్ అంటూ సాయి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ డైలాగులు మెగాస్టార్ కి ఆగ్రహం తెప్పించి ఇద్దరికి క్లాస్ పీకినట్లు అప్పట్లో రూమర్స్ వచ్చాయి. 

అయితే ఇప్పుడు ఈ వివాదాలపై సాయి స్పందించాడు. స్పెషల్ గా  ఆ మాటలపై స్పందించలేదు గాని మా మధ్య అయితే ఇప్పటివరకు ఎలాంటి గొడవలు జరగలేదని అన్నాడు. బన్నీతన ఫ్యామిలీ మెంబర్ అంటూ.. అతనితో నేను ఫ్రెండ్లి గా ఉంటానని ఆన్సర్ ఇచ్చాడు. ఇక తాను ఎక్కువగా ఉండేది మాత్రం చరణ్ - వరుణ్ లతోనే అని చెప్పాడు. ఇక మెగా ఫ్యామిలిలో ఎవరికీ ఎలాంటి గొడవలు లేవని అభిమానులు మధ్య కూడా ఎలాంటి విబేధాలని ఉండవని తేజు వివరణ ఇచ్చాడు.