Asianet News TeluguAsianet News Telugu

సాయిధరమ్ లేటెస్ట్ హిట్ సోలో బ్రతుకే సో బెటర్ వరల్డ్ ప్రీమియర్ గా జీతెలుగులో!

 ప్రేమకు ఒక కొత్త అర్ధాన్ని చెప్పిన 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాతో ఈ ఆదివారం అంటే 21 ఫిబ్రవరి సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో ప్రసారం చేయనుంది.

sai dharam latest hit solo brathuke so better world television premier on zee telugu ksr
Author
Hyderabad, First Published Feb 16, 2021, 10:41 AM IST

ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉండే జీ తెలుగు ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఫిబ్రవరి లో తన ప్రేమను తనకి ఇష్టమైన ప్రేక్షకులపై కురిపించకుండా ఉంటుందా? అందుకే ఈ ఆదివారం మరో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో మన ముందుకు వస్తుంది జీ తెలుగు.  ప్రేమకు ఒక కొత్త అర్ధాన్ని చెప్పిన 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాతో ఈ ఆదివారం అంటే 21 ఫిబ్రవరి సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో ప్రసారం చేయనుంది. 

యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కించిన దర్శకుడు సుబ్బు కథ విషయానికి వస్తే.. విరాట్ (సాయి ధరమ్ తేజ్) ఇంజనీరింగ్ చదువుతూ ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ ఎమోషన్స్‌‌కి అస్సలు విలువ ఇవ్వడు. అసలు పెళ్లే వద్దంటూ.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ ఓ పుస్తకాన్ని రాయడమే కాకుండా పెళ్లి వద్దంటూ ఉపన్యాసాలు ఇస్తుంటాడు. కాలేజ్‌లో ఉద్యమాన్ని లేవనెత్తి ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఆర్గనైజేషన్ కి ఫౌండర్ అవుతాడు. తన మామ (రావు రమేష్) ఇతన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. జీవితంలో పెళ్లే చేసుకోను అని డిసైడ్ అయిన కొంతమంది స్నేహితులతో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లిన విరాట్‌కి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. స్నేహితులు ఒక్కొక్కరు పెళ్లి చేసుకుని దూరం అవుతారు. విరాట్ ఒంటరిగా మిగిలిపోతాడు. ఆ టైంలో విరాట్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అమృత (నభా నటేష్) విరాట్ జీవితంలోకి ఎలా వచ్చింది? అన్నదే మిగిలిన కథ.థమన్ మరోసారి తన మ్యూజిక్‌తో ఆకట్టుకోగా, వెంకట్ దిలీప్ సినిమాటోగ్రఫీ అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు. 2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ. 

దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది. విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios