చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి ఎస్ నివాస్ తుదిశ్వాస విడిచారు. 73ఏళ్ల నివాస్ కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కేరళలోని కోజికోడ్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నివాస్ కన్నుమూసినట్లు సమాచారం. నివాస్ మరణాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కాలికట్ లోని నడక్కావు లో నివాస్ జన్మించారు. చిత్ర పరిశ్రమపై మక్కువతో ఆయన చెన్నైకి రావడం జరిగింది. 

అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు  సినిమాటోగ్రఫీ కోర్స్ చేశారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సాగరసంగమం చిత్రానికి నివాస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. నివాస్ కి సత్యత్తింటే నిళల్ మొదటి చిత్రం కాగా, ఆ సినిమా ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. 

భారతీ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన 16 వయదినిలే చిత్రానికి ఆయన వర్క్ చేశారు. చిరంజీవి నటించిన పునాది రాళ్లు చిత్రానికి నివాస్ వర్క్ చేయడం జరిగింది. నివాస్ మృతి వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నివాస్ కుటుంబానికి సానుభూతి తెలియజేయడం జరిగింది.