Asianet News TeluguAsianet News Telugu

`నెపోటిజం` కంటే విధి గొప్పది.. సాగర కన్య సంచలన వ్యాఖ్యలు..

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నాక నెపోటిజం అనేది బాగా చర్చనీయాంశంగా మారింది. నెపోటిజం వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారని అనేక మంది ఆరోపించారు.

Sagara Kanya fame shilpa shetty sensational comments on Nepotism
Author
Hyderabad, First Published Aug 9, 2020, 7:54 PM IST

`సాగర కన్య` శిల్పా శెట్టి నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బాలీవుడ్‌లో `నెపోటిజం`పై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో తాజాగా శిల్పా శెట్టి భిన్నంగా స్పందించింది. నెపోటిజానికి మద్దతు పలికింది. విధిరాత కంటే నెపోటిజం గొప్పదేమీ కాదని అన్నారు. విధిని తాను కచ్ఛితంగా విశ్వసిస్తానని, అదే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పారు. 

`నా ఫ్యామిలీకి ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. కానీ కృషి, పట్టుదలతో ఈ స్థాయి చేరుకున్నాను. స్వతహాగా ఎదిగాను. తన నటనే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అందులో విధి పాత్ర చాలా కీలక పాత్ర పోషించింది. విధి కారణంగానే మనమందరం ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ నిలదొక్కుకోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. పట్టుదలతో పాటు ప్రతిభ కూడా ఉండాలి. చేరుకోవలసిన గమ్యం కోసం శాయశక్తుల ప్రయత్నించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం కోసం పట్టుదలతో పోరాడాలి. అప్పుడు మనం సక్సెస్ అవ్వకుండా ఎవ్వరూ అడ్డకోలేరు` అని ఈ మాజీ హాట్‌ భామ తెలిపింది. 

ఇదిలా ఉంటే బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నాక నెపోటిజం అనేది బాగా చర్చనీయాంశంగా మారింది. నెపోటిజం వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారని అనేక మంది ఆరోపించారు. బాలీవుడ్‌లో నెపోటిజం అంతర్లీనంగా విస్తరించి ఉందని, దానికి అనేక మంది బలవుతున్నారంటూ కామెంట్స్ వినిపించాయి. దీనిపై కంగనా రనౌత్‌ వంటి హీరోయిన్లు, పలువురు నటులు స్పందించి నెపోటిజానికి వ్యతిరేకంగా ఓ ఉద్యమాన్నే స్టార్ట్ చేశారు. దీంతో ఇప్పుడిది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో శిల్పా కామెంట్స్ మరింత దుమారాన్ని రేపుతున్నాయి.

ఇక 1990, 20లో తన అందం, అభినయంతో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన ఈ అమ్మడు తెలుగులో `సాహస వీరుడు సాగర కన్య` చిత్రంలో వెంకటేష్‌ సరసన నటించి మెప్పించిన విషయం తెలిసిందే. దీంతోపాటు `వీడెవడండి బాబు`, `అజాద్‌`, `భలేవాడివి బాసు` వంటి చిత్రాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. 2007లో `అప్నే` తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. రాజ్‌కుద్రని వివాహం చేసుకుని పూర్తిగా ఫ్యామిలీ జీవితానికే పరిమితమైంది. మధ్య మధ్యలో పలు సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ , స్పెషల్‌ అప్పీయరెన్స్ ఇస్తూ కనువిందు చేసింది. మళ్ళీ ఇటీవల రీ ఎంట్రీ ఇస్తూ, `నికమ్మా`, `హంగామా 2` చిత్రాల్లో నటిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios