`నాటు నాటు` పాట అంతర్జాతీయంగా దుమ్మురేపుతుంది. దీనికి సెలబ్రిటీలే కాదు, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు, అధికారులు కూడా డాన్సులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ప్రముఖ ఆథ్యాత్మిక,యోగా గురువు సద్గురు స్పందించారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ అంతర్జాతీయంగా తన సత్తా చాటుంది. సినిమా విడుదలయ్యాక కంటే ఇప్పుడే మరింతగా జనాల్లోకి దూసుకెళ్తుంది. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట ఆస్కార్‌కి నామినేట్‌ అయిన నేపథ్యంలో మరింతగా ఆదరణ పొందుతుంది. విదేశీయులు సైతం ఈ పాటకు డాన్సు చేస్తూ వీడియోలు సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అందులో భాగంగా కొరియన్‌ ఎంబసీ అధికారులు `నాటు నాటు`కి డాన్సు చేయడం విశేషం. 

ఈ నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక యోగా గురువు, ఈషా ఫౌండేషన్‌ అధినేత సద్గురు `ఆర్‌ఆర్‌ఆర్‌`ని అభినందించారు. కొరియన్‌ ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు. ఇండియాలోని కొరియన్‌ ఎంబసీ అధికారులు చేసిన `నాటు నాటు` డాన్సు వీడియోని పంచుకుంటూ సద్గురు తన అభినందనలు తెలియజేయడం విశేషం. ఇందులో ఆయన చెబుతూ, `నాటు నాటుకు ప్రపంచం డాన్సు చేస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి టీమ్‌కి, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా అంబాసిడర్‌కి, ఆయన బృందానికి నాటు నాటు పాటకి కాలు కదిపినందుకు అభినందనలు` అని పేర్కొన్నారు సద్గురు. ఆయన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇందులో కొరియన్‌ ఎంబసీతోపాటు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళిలను ట్యాగ్‌ చేశారు సద్గురు.

Scroll to load tweet…

ఇదిలా ఉంటే గత మూడు రోజుల క్రితం `నాటు నాటు` పాటకి కొరియన్‌ ప్రభుత్వ అధికారులు డాన్సులు వేయడం విశేషం. ఇండియాలోని కొరియన్‌ ఎంబసీ అంబాసిడర్‌తోపాటు వారి స్టాఫ్‌ మెంబర్స్ కలిసి ఈ పాటకి డాన్సు చేశారు. అంతేకాదు, దీన్ని ఓ వీడియో రూపంలో చిత్రీకరించారు. ఇందులో పర్‌ఫెక్ట్ మ్యాచింగ్‌తో కొరియన్‌ ఎంబసీ(ఇండియా) అధికారులు ఈ డాన్సులు చేయడం ఆకట్టుకుంటుంది. కొరియన్‌ ఎంబసీ ఇండియా అధికారిక ట్విట్టర్‌ ద్వారా ఈ వీడియోని పంచుకోగా, అది వైరల్‌ అవుతుంది. దీన్ని ఈ ఉదయం రామ్‌చరణ్‌ కూడా ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. 

రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని సాంగ్‌ `నాటు నాటు` ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యింది. అందులో భాగంగా ఇప్పటికే రామ్‌చరణ్‌, రాజమౌళి అక్కడ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. త్వరలోనే ఎన్టీఆర్‌ కూడా అమెరికా వెళ్లి అక్కడ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఎన్టీఆర్‌, రామ్‌చరన్‌ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటించగా, అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. గతేడాది మార్చి 25న ఈ చిత్రం విడుదలైంది. సుమారు రూ12వందల కోట్లు వసూలు చేసింది. అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.