తాప్సీ, భూమి పెడ్నేకర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ అనే చిత్రం రూపొందుతుంది . తుషార్‌ హీరానందని దర్శకత్వంలోఈ సినిమా రూపొందుతోంది. ఇందులో తాప్సీ, భూమి అక్కా చెల్లెళ్లుగా కనిపించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ మహిళా షూటర్లు చంద్రో, ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో 87 ఏళ్ళ చంద్రో తోమ‌ర్ పాత్ర‌లోతాప్సీ పన్ను న‌టిస్తుండ‌గా, 82 ఏళ్ళ‌ ప్రకాశీ తోమర్ పాత్ర‌లో భూమి పడ్నేక‌ర్ న‌టిస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్ ని ఆసక్తికరంగానే కట్ చేశారు. ట్రైలర్ ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో ఓ అంచనాకి రావొచ్చు.

ఇద్దరు ముసలివాళ్లు తన పిల్లల కోసం అరవై ఏళ్ల వయసులో తుపాకీ చేపడతారు. వారి చదువులను అడ్డుకోవాలని చూసేవాళ్లని తుపాకీలతో బెదిరించేవారు. ఈ క్రమంలో వారు టార్గెట్ మిస్ అవ్వకుండా దేన్నైనా షూట్ చేయగలరనే విషయం తెలుసుకుంటారు.

అలా వారు జాతీయ స్థాయిలో జరిగిన రైఫిల్‌ షూటింగ్‌లో పాల్గొంటారు. దాదాపు 300లకు పైగా పతకాలు సాధించారు. ఇదే కథతో సినిమాను తెరకెక్కించారు. ఈ మహిళా షూటర్లకు యూపీలో ‘షూటర్‌ దాదీస్‌’గా మంచి పేరుంది. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.