యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. హాలీవుడ్ స్థాయి విజువల్స్, టేకింగ్ తో దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్ లాంటి బాలీవుడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ప్రస్తుతం సాహో ప్రోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగష్టు 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా సాహు చిత్ర మొట్టమొట్టి షోని నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట పట్టణంలో ప్రదర్శించనున్నారు. మీరు విన్నది నిజమే. కేవలం సాహో చిత్ర యూనిట్ కు బుధవారం అంటే ఆగష్టు 7న ఈ షో ప్రదరించనున్నట్లు తెలుస్తోంది. 

ఇది కేవలం ట్రయల్ షో మాత్రమే. సూళ్లూరు పేట పట్టణాన్నే ఎంచుకోవడానికి కారణం ఉంది. సూళ్లూరుపేటలో యువి క్రియేషన్స్ సంస్థ సొంత థియేటర్ నిర్మాణంలో ఉంది. తూర్పు దక్షణ ఆసియాలో అతిపెద్ద స్క్రీన్ తో నిర్మితమవుతున్న థియేటర్ ఇదే. 

ప్రస్తుతం థియేటర్ నిర్మాణం చివరి దశలో ఉంది. సాహో లాంటి యాక్షన్ చిత్రాన్ని ఇలాంటి పెద్ద స్క్రీన్స్ లోనే ఆస్వాదించాలి. సాహో చిత్రం ప్రేక్షకుల ఎలాంటి అనుభూతి కలిగించబోతోంది, సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్ థ్రిల్ ని కలిగించేలా ఉన్నాయా లాంటి అంశాలని ఒకసారి సరిచూసుకునేందుకు చిత్ర యూనిట్ ఈ థియేటర్ ని ట్రయల్ షో కోసం ఉపయోగించుకుంటోంది. రేపు ట్రైయల్ షో కోసం దర్శకుడు, ఇతర టెక్నీషియన్స్ సూళ్లూరుపేట బయలుదేరారు.