బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ధీరుడు సల్మాన్ ఖాన్ తెలుగు సినిమాలంటే తెగ ఇష్టపడతాడు. అలాగే ఇక్కడి యాక్టర్స్, టెక్నీషియన్స్ పై కూడా తెగ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. పోకిరి - కిక్ వంటి సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేసి తన మార్కెట్ ను పెంచుకున్న భాయ్ ఇప్పుడు మరో తెలుగు కథపై(మహర్షి) ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. 

ఆ సంగతి పక్కనపెడితే ఇటీవల ప్రభాస్ సినిమాలో సల్మాన్ గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పుకున్నట్లు ఓ టాక్ వచ్చింది. సాహో సినిమాలో ప్రభాస్ తో పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్ లో సల్మాన్ మెరుపు తీగలా వచ్చి వెళతాడని రూమర్స్ వినిపించాయి. అయితే ఈ విషయంపై ఆరా తీయగా ఆ రూమర్స్ ని సాహో టీమ్ కొట్టిపారేసింది. 

అందులో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ వచ్చే వరకు ఎలాంటి రూమర్స్ ని నమ్మవద్దని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న సాహో ఆగస్ట్ లో రిలీజ్ కానుంది. ఆ నెల 15వ తేదీన సినిమాను రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ముందే డిసైడ్ అయినప్పటికీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.