ప్రభాస్ 'సాహో' సినిమా రిలీజ్ అనంతరం ఏ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుందో గాని సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం సాలిడ్ గా ఉంది. బాలీవుడ్ బడా సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఒక తెలుగు హీరో సినిమా స్ట్రాంగ్ బిజినెస్ చేస్తోంది. 

పరబాషాలో సినిమా బిజినెస్ ఎలా ఉందనే విషయాన్నీ పక్కనపెడితే సొంత గడ్డపై ప్రభాస్ టార్గెట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే తెలుగులో సాహో ప్రీ రిలీజ్ రేట్స్ కళ్ళు చెదిరేలా ఉన్నాయ్. సినిమా మొత్తంగా రెందు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్లు కలెక్ట్ చేయాల్సిందే. నైజం ఏరియాలో దిల్ రాజు 30కోట్ల రేటుతో సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. 

కుదిరితే యూవీ క్రియేషన్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ లో భాగం అయ్యే అవకాశం ఉంది. ఆంధ్ర - సీడెడ్ ఇలా మిగతా ఏరియాల్లో మొత్తంగా 80కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. అంటే సినిమా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 110కోట్ల ధర పలికింది. మినిమమ్ 120కోట్లు రాబడితేనే ప్రభాస్ సాహో హిట్ లిస్ట్ లో చేరినట్లు లెక్క. మరి ఆ లెక్కలు ఎంతవరకు రికవర్ అవుతాయో తెలియాలంటే ఆగస్ట్ 15వరకు వెయిట్ చేయాల్సిందే.