యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూ ల్ షూటింగ్ జరుపుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనతో వున్నారు. ఈ కారణంగానే శ్రద్ధా కపూర్ ను కథానాయికగా తీసుకున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. శ్రద్ధా కపూర్ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా నాయక్ ట్విట్టర్లో ఈ ఫస్టులుక్ ను షేర్ చేసింది. సహజంగానే మంచి అందగత్తె అయిన శ్రద్ధా కపూర్ ఈ  ఫస్టులుక్ లో మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు యూనిట్ ఎంతగానో సహకరించిందనీ .. తన ఇంట్లోనే వున్నట్టుగా ఫీలయ్యానని శ్రద్ధా కపూర్ ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చింది.