యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఆగష్టు 30న సాహో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తోంది. 

తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన రొమాంటిక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఘాటు రొమాన్స్ లో ప్రభాస్, శ్రద్దా మునిగితేలుతున్నారు. ఈ పోస్టర్ లో శ్రద్దా కపూర్ ప్రభాస్ ఒళ్ళో కూర్చుని అతడిని కౌగిలించుకుంటోంది. ఒకరినొకరు కౌగలించుకుని రొమాన్స్ లో మైమరచిపోయినట్లు కనిపిస్తున్నారు. 

ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో.. ప్రభాస్, శ్రద్దా మధ్య లవ్ సీన్స్ కూడా ప్రేక్షకులని అంతగానే ఆకట్టుకుంటాయట. శ్రద్దా కపూర్ సౌత్ లో నటిస్తున్న తొలి చిత్రం ఇదే. ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ పోలీస్ అధికారిగా కనిపించనుంది.