‘బాహుబలి’ 1, 2 సూపర్ హిట్స్ తర్వాత రిలీజ్ కాబోతున్న  ‘సాహో’ చిత్రంపై  ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠ రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే నిర్మాతలు మాత్రం దాన్ని పట్టించుకోకుండా రిలీజ్ డేట్ లను మార్చుకుంటూ పోతున్నారు. ఇంతకాలం ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేస్తామని ఇప్పటి వరకు చిత్రయూనిట్ చెప్తూ వచ్చింది. కానీ ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కావడం లేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30న విడుదల చేయబోతున్నట్లుగా అఫీషియల్ గా ప్రకటన చేసారు. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు చెప్తున్నారు. 

యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో వంశీ, ప్రమోద్, విక్కీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ర‌న్‌ రాజా రన్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ ఈ చిత్రానికి దర్శకుడు. 

భారీ తారాగణం నటిస్తున్న దీంతో ఇప్పటి వరకు ‘సాహో’ విడుదలను దృష్టిలో పెట్టుకుని వాయిదా పడిన చిత్రాలన్నీ ఈ ఆగస్ట్ 15కు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే శర్వానంద్ ‘రణరంగం’, అడవి శేష్ ‘ఎవరు’ చిత్రాలు ఆగస్ట్ 15న విడుదల అవుతున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు.