టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సాహో ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ ఈ సినిమా రిలీజ్ కు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ట్రైలర్ ను ఈ నెల 10న రిలీజ్ చేసి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. 

ప్రభాస్ అభిమానులు చాలా వరకు ప్రీ రిలీజ్ డేట్ కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఆ వేడుక ఈ నెల 18న నిర్వహించాలని అనుకుంటున్నారట. ఒకవేళ అప్పుడు కుదరకపోతే 24వ తేదీన జరపాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు తేదీల్లో ఎదో ఒక డేట్ ని ఫైనల్ చేసి రామోజీ ఫిల్మ్ సిటీ లేక ఎల్బీ స్టేడియంలో గాని ఈవెంట్ కు వేదికను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.     

బాహుబలి సినిమా వేడుకలు చాలా వరకు రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగాయి కాబట్టి అక్కడైతేనే సిటీకి దూరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని యూవీ క్రియేషన్స్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది.