టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో బారి బడ్జెట్ చిత్రం సాహో. ప్రభాస్ నటించిన ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా రిలీజ్ తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు ఏ రేంజ్ లో బద్దలవుతాయో ఉహించడం కష్టమే. ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ రేట్లు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సాహో తెలుగు రైట్స్ కొనుక్కోవడానికి నిర్మాతలకు 120 కోట్ల నుంచి 150 కోట్ల వరకు అఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మిగతా తమిళ్ - హిందీ భాషల్లో కూడా 100 కోట్ల ప్రై రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. చూస్తుంటే నాన్ బాహుబలి రికార్డ్స్ ఈజీగా బద్దలు కొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఫైనల్ గా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు చేరుకునే ఛాన్స్ ఉందని టాక్. మరి ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ చేసే సాహో బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ టార్గెట్ 500కోట్లయినా పెట్టుకోవాల్సిందే. చూడాలి మరి ఏ రేంజ్ లో హిట్టవుతుందో. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.