బాహుబలి అనంతరం ప్రభాస్ నుంచి వస్తోన్న మరో బిగ్ బడ్జెట్ మూవీ సాహో. సినిమా విడుదల కావడానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉంది. అయితే సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యేలా చిత్ర యూనిట్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సినిమా పోస్టర్స్ ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. 

రీసెంట్ గా విడుదలైన మరొపోస్టర్ వైరల్ గా మారింది. హీరోయిన్ శ్రద్దా కపూర్ తో కథానాయకుడు ప్రభాస్ ఇంటెన్స్ లవ్ ని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా శ్రద్దా చేతిలో గన్ పట్టుకొని కళ్ళల్లో ఎదో తెలియని భావాన్ని చూపిస్తోంది. సినిమా చూస్తే ఆమె కళ్ళ వెనక ఉన్న అసలు భావం ఏమిటో తెలుస్తుంది. సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించేలా ఉన్న ఈ స్టిల్ ప్రమోషన్ లో బాగా క్లిక్కవుతోంది. 

మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.